Ys Jagan: చంద్రబాబు మంచోడా నేను మంచోడినా, విద్యుత్ కొనుగోలు ఒప్పందం కధ ఇదీ

Ys Jagan on Power Sale Agreement in Telugu: అదానీ వ్యవహారం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై చెలరేగుతున్న ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేసేందుకు జరుగుతున్న కుట్రల్ని ఎండగట్టారు. ఒప్పందం గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2024, 06:53 PM IST
Ys Jagan: చంద్రబాబు మంచోడా నేను మంచోడినా, విద్యుత్ కొనుగోలు ఒప్పందం కధ ఇదీ

Ys Jagan on Power Sale Agreement in Telugu: రాష్ట్ర ప్రభుత్వంపై, రెడ్ బుక్ పాలనపై, చంద్రబాబు అండ్ కో అవినీతి వ్యవహారంపై తూర్పారబట్టిన వైఎస్ జగన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం కోసం ప్రయత్నించిన తాను మంచోడినా లేక చంద్రబాబు సోలార్ ఒప్పందాలతో ఏడాదికి 2 వేల కోట్ల భారానికి కారణమయ్యే చంద్రబాబు మంచోడా అని ప్రశ్నించారు. 

గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో తప్పు జరిగిందనే విధంగా చిత్రీకరించే కుట్రపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. తమ హయాంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఈ ఒప్పందం అత్యంత చౌక ఒప్పందమని గుర్తు చేశారు. తమ ఒప్పందం కారణంగా యూనిట్ విద్యుత్ ధర 5.10 రూపాయల నుంచి 2.49 రూపాయలకు తగ్గిన సంగతిని గుర్తు చేశారు. విద్యుత్ ఒప్పందం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెకీకు మధ్య మాత్రమేనని స్పష్టం చేశారు. 2021 డిసెంబర్ 1న జరిగిన ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో మూడో పార్టీ ప్రమేయమే లేదని స్పష్టం చేశారు. 

యూనిట్‌కు 5.90 మంచిదా లేక 2.49 రూపాయలు మంచిదా

చంద్రబాబు హయాంలో విండ్ , సోలార్ పవర్ ఒప్పందాలతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందని గుర్తు చేశారు. ఆ సమయంలో యూనిట్ 5.90 రూపాయలు కొనుగోలు చేశారని, ఫలితంగా ఏటా 2 వేల కోట్లు భారం పడిందన్నారు. అంటే యూనిట్‌కు అదనంగా 3.49 రూపాయలు కట్టాల్సి వచ్చిందన్నారు. అంత అత్యధిక ధరకు ఒప్పందం చేసుకున్న చంద్రబాబు మంచోడా లేక ఏడాదికి  2 వేల కోట్ల భారాన్ని తగ్గించిన తాను మంచోడినా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన ఒప్పందం అమలై ఉంటే 25 ఏళ్లకు 87 వేల కోట్ల ప్రజల సంపద ఆవిరయ్యేదని గుర్తు చేశారు. 

తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీ నుంచి వచ్చిన లేఖను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల్ని ప్రశంసించిందన్నారు. యూనిట్ విద్యుత్‌కు 2.49 రూపాయలు చొప్పున 9 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామంటూ తెలిపింది. 2024 సెప్టెంబర్ నాటికి 3 వేల మెగావాట్ల విద్యుత్ ఇస్తామని చెప్పినట్టు గుర్తు చేశారు వైఎస్ జగన్. ఏపీ చరిత్రలోనే అత్యంత చౌక విద్యుత్ కొనుగోలు ఒప్పందమని తెలిపారు. ఈ ఒప్పందం వల్ల లక్షల కోట్ల ప్రజా సంపద ఆదా అయ్యేదన్నారు. 

చంద్రబాబు తన హయాంలో 25 ఏళ్లకు 50 వేల కోట్ల అదనపు భారానికి ప్రయత్నిస్తే తాము మాత్రం లక్ష కోట్లు ఆదా చేసే ప్రయత్నం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీకు, ఏపీ ప్రభుత్వానికి ఇంత చౌక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగితే మూడో పార్టీ ప్రమేయం లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 

Also read: Ys Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News