న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ శుక్రవారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించడమే తమ ప్రధాన ధ్యేయమని ‘సంకల్ప్ పత్రం’ లో పేర్కొన్నట్లు తెలిపింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జవదేకర్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ నగరంలో అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆప్ ప్రభుత్వంలో సగం మంత్రులు బెయిల్ పై, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారేనని అన్నారు. ఈ దుష్టాంతాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలియజేశారు.
दिल्ली विधानसभा चुनाव-2020 के लिए भाजपा 'संकल्प पत्र' जारी कर रही है...#DeshBadlaDilliBadlo https://t.co/kPLbzpHbUg
— BJP Delhi (@BJP4Delhi) January 31, 2020
బీజేపీ అధికారంలోకి వస్తే, సొసైటీల క్రమబద్ధీకరణ కోసం, కాలనీ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేస్తామని అన్నారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ఢిల్లీలోని వ్యాపారుల లీజు హోల్డ్ ఆస్తులను ఫ్రీహోల్డ్‌గా మారుస్తామని బీజేపీ హామీ ఇస్తోందని తివారీ తెలిపారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మంది వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు.
ఢిల్లీనగరం దేశానికి గుండెకాయ వంటిదని, మొత్తం దేశానికి ఇది గర్వకారణమని, దేశ చరిత్ర డిల్లీతో ముడిపడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..