హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలిగాయి. వార్డుల విభజన, ఓటర్ జాబితా సవరణపై గతంలో ఇచ్చిన తుది నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండు వారాల్లో మళ్లీ ప్రక్రియ పూర్తి చేయాలనీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హై కోర్ట్.. రాష్ట్రంలో 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టే ఎత్తివేసింది. కొత్తగా ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీలు ఇప్పటివరకు ఉన్న స్టే కారణంగా అభివృద్ధిని నోచుకోకుండా ఉన్నాయని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో.. తాజాగా హై కోర్ట్ ఇచ్చిన తీర్పు వారికి కొంత ఊరటనిచ్చింది.
మొత్తంగా రాష్ట్రంలో 128 మునిసిపాలిటీలు, 13 కార్పోరేషన్స్ ఉండగా..121 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్స్‌కి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. గ్రైటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట సంస్థలకు కాల పరిమితి ఇంకా మిలిగిఉండగా ఇంకొన్ని చోట్ల ఇతర కారణాలతో ఎన్నికలకు వెళ్లే అవకాశం లేనట్టు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికలకు తొలగిన అడ్డంకులు