TSPSC 2024: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1 హాల్‌ టిక్కెట్ల విడుదల.. ఈ లింక్‌తో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

TSPSC Group 1 Hall Ticket Released: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (TSPSC) హాల్‌ టిక్కెట్లను విడుదల చేసింది. గ్రూప్‌ 1 పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన హాల్‌ టిక్కెట్లను సోమవారం విడుదల చేశారు. గ్రూప్‌ 1 ఎగ్జామ్‌ హాల్‌ టిక్కెట్లను అభ్యర్థులు www. tspsc.gov.in డైరెక్ట్ లింక్‌తో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

Written by - Renuka Godugu | Last Updated : Oct 15, 2024, 12:48 PM IST
TSPSC 2024: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1 హాల్‌ టిక్కెట్ల విడుదల.. ఈ లింక్‌తో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

TSPSC Group 1 Hall Ticket Released: తెలంగాణ గ్రూప్‌ 1 ఎగ్జామ్‌కు సంబంధించిన హాల్‌ టిక్కెట్లను అక్టోబర్‌ 14 సోమవారం విడుదల చేశారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ హాల్‌ టిక్కెట్లను వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in ద్వారా అడ్మిట్‌  కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. హాల్‌ టిక్కెట్ల టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్లో ఈనెల 21వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. టీఎస్‌పీఎస్‌సీ మెయిన్స్‌ పరీక్ష అక్టోబర్‌ 21 నుంచి 27 మధ్య నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని వివిధ పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్స్‌ నిర్వహించున్నారు.

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1 హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం..
మొదటా టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in ఓపెన్‌ చేయాలి
ఆ తర్వాత టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డు లింక్‌పై క్లిక్‌ చేయాలి
అక్కడ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.
గైడ్‌లైన్స్‌ను అనుసరించి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
కాపీ ప్రింట్‌ తీసిపెట్టుకోవాలి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
అక్టోబర్‌ 21 నుంచి 27 నిర్వహించే గ్రూప్‌ 1 పరీక్షకు హాల్‌ టిక్కెట్‌ తప్పకుండా తీసుకెళ్లాలి.
అందుకోసమే హాల్‌ టిక్కెట్లను వారం రోజులు ముందుగానే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
మధ్యాహ్నం 12:30 నిమిషాల సమయంలో పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. మధ్యాహ్నం 1:30 వరకు లోపలికి ఎవరినీ అనుమతి ఇవ్వరు అన్నీ గేట్లను మూసివేస్తారు.
అడ్మిట్‌ కార్డుపై అన్ని వివరాలు ఉంటాయి. అభ్యర్థులు ముందుగానే వాటిని క్షుణ్నంగా చదువుకోవాలి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. 

ఇదీ చదవండి: బిగ్‌ అలెర్ట్‌.. భారీవర్షాలు ఈ జిల్లాల్లో అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..  

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1 పరీక్ష ద్వారా 563 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ సూపరిండెంటెండ్‌ ఆఫ్‌ పోలీసు, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, మునిసిప్‌ కమిషనర్‌ పోస్టులను భర్తీ చేస్తారు.

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ..
ప్రిలిమినరీ పరీక్ష తర్వాత మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది జూన్‌ 9 న నిర్వహించారు. ఆ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు హాజరు కావాలి.

ఇదీ చదవండి: మహిళలకు దీపావళి బంపర్‌ బొనాంజా.. ఖాతాల్లో 3000 జమా చేస్తున్న ప్రభుత్వం..  

అయితే, హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడు దానిపై అభ్యర్థుల ఫోటో బ్లర్‌గా కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులు తమతోపాటు 3 పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలను తీసుకువెళ్లాలి. గెజిట్‌ సైన్‌ కలిగిన కాపీని కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. లేకపోతే ఎగ్జామ్‌ సెంటర్లోకి అభ్యర్థులను పరీక్ష రాయడానికి అనుమతించరు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News