హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు అందించే కరువుభత్యం(డియర్‌నెస్ అలయన్స్) పెంపునకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీఆర్సీ, డిఏ పెంచాల్సిందిగా ఎప్పటి నుంచో టీఎన్జీవోలు, టీజీవోలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ తాజాగా వారినే స్వయంగా ప్రగతి భవన్‌కి పిలిపించుకుని మరీ వారి సమస్యలు సావధానంగా విని మరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు 3.44% కరువు భత్యం అందే అవకాశం ఉన్నట్లు సమాచారం. పనిలోపనిగా పీఆర్సీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ ముగిశాక ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. తమ డిమాండ్లకు సర్కార్ నుంచి సానుకూలమైన స్పందన లభించిందని అన్నారు. అక్టోబర్ 21 తర్వాత ఎన్నికల కోడ్ ముగిశాక దశల వారీగా సమస్యలు పరిష్కారిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
'కరువుభత్యం' పెంపునకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!