Foods To Never Combine With Tea: ప్రతిరోజూ ఉదయం టీ తీసుకున్నాకే రోజు గడుస్తుంది. టీ లేకపోతే ఏ పని కూడా చేయలేని వారుంటారు. అయితే, చాలామంది టీతోపాటు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటారు. కానీ, ఇవి అనారోగ్యకరం. ఏ ఆహారాలు అయినా అతిగా తింటే అనర్థాలే జరుగుతాయి. టీ తోపాటు బిస్కట్స్, పకోడి, సమోసా వంటివి కూడా తీసుకునేవారు ఉన్నారు. ఇవి లేకుండా టీ తాగలేరు కూడా. ఎందుకంటే ఇలా తింటే రుచిగా ఉంటుంది అని భావిస్తారు. అయితే, మీ టేస్ట్ బడ్స్‌కు అనుగుణంగా తింటే మీ జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది జాగ్రత్త.. టీ తోపాటు అస్సలు తినకూడని ఆహారాలు ఉంటాయి. ఇవి మీ కడుపుపై నెగిటీవ్ ప్రభావం చూపుతాయి. అలాంటి ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
కూరగాయలు..
టీ తీసుకునేటప్పుడు పొరపాటున కూడా ఆకుకూరలు ఉండే ఆహారాలు అస్సలు తనకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టీ లో టానిన్స్ ఆక్సలేట్స్ ఉంటాయి. ఇది ఐరన్ గ్రహించడాన్ని తగ్గిస్తుంది. ఆకకూరలు టీ తోపాటు తీసుకోవడం వల్ల ఐరన్ గ్రహించడాన్ని నివారిస్తుంది.
నిమ్మకాయ..
నిమ్మకాయలు కూడా టీ తోపాటు తీసుకుంటే అనర్థాలే జరుగుతాయి. ఈ రెండు ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండె మంటకు కూడా దారితీస్తుంది. కడుపులో అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది. నిమ్మకాయలలో ముఖ్యంగా విటమిన్ సీ ఉంటుంది. ఇది యాసిడ్ రిఫ్లక్షన్‌కు దారితీస్తుంది. అందుకే టీ తోపాటు నిమ్మకాయను తినకూడదు.
గింజలు..
బాదం, వాల్నట్, జీడిపప్పు వంటి గింజలను కూడా టీ తోపాటు తీసుకోకూడదు. ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది. గింజలు టీ లోని ట్యానిన్ పోషకాలు గ్రహించడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే ఇలాంటి గింజలను కూడా టీతోపాటు తీసుకోకూడదు.
ఇదీ చదవండి: ప్రతిరోజు నానబెట్టిన ఒక్క వాల్‌నట్ తిన్నా 10 ప్రయోజనాలు తెలుసా?
శనగపిండి..
శనగపిండితో తయారు చేసిన స్నాక్స్ పకోడీ, నంకీన్ వంటివి తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఈ డైటరీ కాంబినేషన్ వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. టీ తోపాటు శనగపిండితో తయారు చేసి ఆహారాలు తీసుకోవడం వల్ల యాసిడిటీ, మలబద్ధకం, అజీర్తి సమస్యలు తీసుకువస్తుంది.
పసుపు..
పసుపులో ఉండే ప్రధాన వస్తువు కర్కూమిన్ ఇది సాధారణంగా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అయితే, పసుపును టీ తోపాటు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. ఇది కెమికల్ రియాక్షన్‌కు దారితీస్తుంది. జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
ఇదీ చదవండి: ఈ 5 ఆహారాలు డిమెన్షియా సమస్యను మీ దరిచేరనివ్వవు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి