High Cholesterol Diet: కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉందా? తక్షణమే ఇవి తినడం ఆపేయండి..

High Cholesterol Symptoms: ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ముందుగా.. దెబ్బ తినేది మన గుండె. అందుకే గుండె ఆరోగ్యాన్ని.. కాపాడుకోవడం కోసం కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉండాలి. ఒకవేళ హై కొలెస్ట్రాల్ తో.. మీరు బాధపడుతుంటే కచ్చితంగా ఈ ఆహార పదార్థాలకు.. దూరంగా ఉండాల్సిందే.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 10, 2024, 03:57 PM IST
High Cholesterol Diet: కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉందా? తక్షణమే ఇవి తినడం ఆపేయండి..

Cholesterol Foods To Avoid: శరీరంలో చెడు కొలెస్ట్రాల్.. ఎక్కువ అయ్యే కొద్ది అది ప్రాణాంతకంగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల.. ముందుగా దెబ్బతినేది మన గుండె ఆరోగ్యం. హృదయనాళాలలో కూడా ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయి.. రక్త ప్రసరణ సరిగ్గా అవ్వకుండా చేస్తుంది. దీనివల్ల రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల ఒకటి కాదు.. రెండు కాదు..ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. 

ఒకవేళ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. వెంటనే మనం చేయాల్సింది మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం. జీవన శైలిలో కీలకమైన మార్పులు.. తీసుకురావడం. పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే.. కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పుకోవచ్చు.

ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి: 

జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. ఇన్స్టంట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కి కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఎక్కువగా నూనె.. ఉండే ఆహార పదార్థాలు, వేయించిన ఆహారం కూడా.. కొలెస్ట్రాల్ ఉన్నవారికి మంచిది కాదు. 

కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిది కానీ.. అందులోని పచ్చ సొన కి మాత్రం కొలెస్ట్రాల్ ఉన్నవారు.. దూరంగా ఉండాల్సి ఉంటుంది. జీడిపప్పు లేదా నెయ్యి కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని.. ఎక్కువగా పెంచేస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా తినడం.. శ్రేయస్కరం కాదు. 

ప్యాక్ చేసిన ఆహారం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. దానివల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో చేసిన ఆహారం తినడం.. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి చాలా మంచిది.

వేయించిన ఆహారం కూడా ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల చెడు కొలెస్ట్రాల్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు.. వాటిని తినడం మానేయడం బెటర్.

డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, కుకీస్ వంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు. అవి కూడా శరీరంలో కొలెస్ట్రాల్ ఇస్తానని ఎక్కువగా పెంచుతూ ఉంటాయి.

కొలెస్ట్రాల్ ఉన్నవారు ఇలాంటి ఆహారానికి దూరంగా ఉంటూ పౌష్టిక ఆహారం తీసుకోవడం మంచిది. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని తెలిసినప్పటికీ.. ఇలాంటి ఆహారం తీసుకుంటూ ఉండటం వల్ల థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

అధిక కొలెస్ట్రాల నుంచి తప్పించుకోవడం ఎలా: 

మన ఆహారపు అలవాట్లలో మార్పులతో పాటు, సరైన వ్యాయామం కూడా ఉండడం మంచిది. రోజు నడవడం.. లేదా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News