IT Returns Benefits: మీ ఆదాయం ట్యాక్స్ పరిధిలో లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా

IT Returns Benefits: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఇది. గడచిన ఆర్ధిక సంవత్సరం 2023-2 రిటర్న్స్‌తో పాటు 2024-25 సంవత్సరం అసెస్‌మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే ట్యాక్స్ పరిధిలో ఆదాయం లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2024, 07:38 PM IST
IT Returns Benefits: మీ ఆదాయం ట్యాక్స్ పరిధిలో లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా

IT Returns Benefits: ప్రతి ఉద్యోగి ఇన్‌కంటాక్స్ చెల్లించే పరిధిలో ఉండడు. సాధారణంగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ అనేది ట్యాక్స్ పేయర్లే ఫైల్ చేస్తుంటారు. ట్యాక్స్ పరిధిలో ఉండని ఉద్యోగులు ఐటీఆర్ సమర్పించరు. కానీ ట్యాక్స్ పరిధిలో లేనివాళ్లు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. అలా చేస్తే లాభమే తప్ప నష్టం లేదంటున్నారు నిపుణులు.

ఇన్‌కంటాక్స్ పరిధిలో లేని ఉద్యోగులు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల కలిగే లాభాలను పరిగణలో తీసుకోవాలని సూచిస్తున్నారు ఆర్ధిక నిపుణులు. అంటే నాన్ ట్యాక్స్ పేయర్లు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల భవిష్యత్తులో చాలా లాభాలుంటాయంటున్నారు. రుణాలు తీసుకునేటప్పుడు , వ్యాపారం ప్రారంభించేటప్పుడు, వీసా కోసం అప్లై చేసినప్పుడు, పిల్లల్ని చదువు నిమిత్తం విదేశాలకు పంపినప్పుడు ఐటీ రిటర్న్స్ చాలా అవసరమౌతుంటాయి.

అంతేకాకుండా ఐటీ రిటర్న్స్ అనేది ఆ వ్యక్తి ఆదాయానికి నిర్దిష్టమైన రుజువులా పనిచేస్తుంది. అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు ఐటీ రిటర్న్స్ ను ఆదాయం ప్రూఫ్‌గా అంగీకరించాల్సిందే. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వ్యక్తికి కారు లోన్, హోమ్ లోన్ చాలా త్వరగా వస్తుంది. ఏదైనా వేరే దేశానికి వెళ్తుంటే వీసా కోసం అప్లై చేసినప్పుడు ఆదాయం ప్రూఫ్ అడుగుతారు. ఈ క్రమంలో ఐటీ రిటర్న్స్ అద్బుతంగా ఉపయోగపడుతుంది. వీసా త్వరగా మంజూరయ్యేందుకు దోహదం చేస్తుంది. 

ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఐటీ రిటర్న్స్ కాగితాలు అడుగుతున్నాయి. దీని ద్వారా ఆ వ్యక్తి ఆదాయం మార్గాలేంటనేది తెలుసుకునేందుకు వీలుంటుంది. షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఐటీ రిటర్న్స్ ఉపయోగపడతాయి. ఎందుకంటే మ్యూచ్యువల్ ఫండ్స్ నష్టం వాటిల్లితే మరుసటి ఏడాది ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు నష్టాన్ని చూపించుకుని ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. మీ ఆదాయం ఇన్‌కంటాక్స్ పరిధిలో లేకపోయినా ఏదైనా కారణంతో టీడీఎస్ కట్ అయితే  ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసి పొందవచ్చు. 

Also read: SIP Mutual Funds: ఈ ఫండ్‌లో నెలకు 10 వేలు పెడితే 48 లక్షలు చేతికి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News