Mohammed Shami ruled out of IPL 2024: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు గుజరాత్ టైటాన్స్ కు పెద్ద దెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్ మహ్మద్ షమీ ఐపీఎల్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయం వల్ల ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు దూరమైన షమీ.. శస్త్రచికిత్స కోసం యూకేకు వెళ్లనున్నట్లు సమాచారం. దాని వల్లే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ నుంచి షమీ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ వర్గాలు గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2024 సీజన్ షెడ్యూల్ ఇంకా ఫిక్స్ కాలేదు. మార్చి 22 తర్వాత ఉండే అవకాశం ఉంది. మే 26న ఫైనల్ ఉండొచ్చని టాక్. తొలి మ్యాచ్ చెన్నై, గుజరాత్ ల మధ్య జరిగే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చీలమండ గాయం వల్లే గత వన్డే వరల్డ్ కప్ తర్వాత ఏ సిరీస్ లోనూ ఆడలేదు షమీ. ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. మునుపటి సీజన్లలో గుజరాత్ విజయాల్లో షమీ కీలకపాత్ర పోషించాడు. ఈ 33 ఏళ్ల పేసర్ 2022 ఐపీఎల్ లో 20 వికెట్లు, 2023లో 18.64 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా షమీ కొత్త బంతితో వికెట్లు తీయడంలో దిట్ట. గత రెండు సీజన్స్ లో టైటాన్స్ కు సారథ్యం వహించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్ లో ముంబైకు ఆడుతున్నాడు. హార్దిక్, షమీ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బనే చెప్పాలి. మరోవైపు ఈ సీజన్ కు గుజరాత్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ వ్యవహారించనున్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ లో గుజరాత్ ఫైనల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.
Also Read: రాంచీ టెస్టుకు టీమ్ ను ప్రకటించిన ఇంగ్లండ్.. జట్టులోకి డేంజరస్ పేసర్..
Also Read: Yuvraj Singh: ఎంపీగా పోటీ చేయనున్న యువరాజ్ సింగ్.. ఏ పార్టీ నుంచంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి