U-19 World Cup Final: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తెలుసుపోయింది. తుదిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ యువ భారత్.. ఆస్ట్రేలియాను ఢీకొట్టబోతుంది. గురువారం జరిగన రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన సెమీస్ లో పాక్ జట్టును వికెట్ తేడాతో ఓడించింది ఆసీస్.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ 48.5 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. అజాన్ (52), అరాఫత్ (52) హాఫ్ సెంచరీలు చేసిన జట్టుకు భారీ స్కోరును అందించలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో టామ్ స్ట్రాకర్ 6 వికెట్లు చెలరేగాడు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. హ్యారీ (50), ఒలీవర్ (49) రాణించారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
సైంధవుడిలా ఆసీస్..!
అయితే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన యంగ్ ఇండియా టైటిల్ నిలబెట్టుకుంటుందా లేదా ఆసీస్ ముందు తలవంచుతుందా అనేది చూడాలి. ఎందుకంటే కంగూరు జట్టు ఫైనల్ కు వచ్చిందంటే చాలు మన వాళ్ల గుండెల్లో గుబులు పుడుతోంది. 2003 ప్రపంచకప్ ఫైనల్, 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో మనకు తీరని గుండె కోత మిగిల్చింది ఆ జట్టు. మహిళల టీ20 ప్రపంచకప్ లో కూడా భారత్ జోరుకు ఆసీస్ బ్రేకులు వేసింది. ఐసీసీ ఈవెంట్స్ లో రెచ్చిపోయే ఆసీస్ ఈసారి భారత్ కు సైంధవుడిలా అడ్డుపడుతుందా లేదో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.
Also Read: U19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ ను టీమిండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
సెమీస్‌లో పాక్‌పై విజయం.. ఫైనల్స్‌లో టీమిండియా ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా..!