Online Buffalo Delivery Fraud: ప్రస్తుతం ఆన్ లైన్ యుగం నడుస్తోంది. ఏది కావాలన్న కూడా నిముషాల్లోనే గుమ్మంలో ఉండేలా టెక్నాలజీ అప్ డేట్ అయ్యింది. అనేక యాప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో మన నిత్యజీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని కూడా కాలు ఇంటి బయట పెట్టకుండా ఆర్డర్ పెట్టి, ఈజీగా తెప్పించుకోవచ్చు. అయితే.. కొందరు ఈ టెక్నాలజీని అతిగా వాడి బద్ధకస్తులుగా కూడా మారిపోయారని చెబుతుంటారు.
ప్రతి దానికి ఆన్ లైన్ లమీద ఆధారపడకుండా.. వెసులు బాటు ఉన్నవాటికోసం స్వతహాగా వెళ్లి కావాల్సినవి కొనుగోలు చేయాలని పెద్దలు చెబుతుంటారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ కు చెందిన అనేక మోసాలు చాలా చోట్ల వెలుగు చూస్తున్నాయి. అచ్చం ఇలాంటి ఘటన వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీకి చెందిన రైతు ఆన్ లైన్ లో బిగ్ ట్విస్ట్ ఎదురైంది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ కు చెందిన సునీల్ కుమార్ అనే రైతు కొన్నిరోజులుగా మంచి పాలనిచ్చే గేదె కోసం ఆన్ లైన్ లో విపరీతంగా వెతుకుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని వీడియోలను కూడా చూశాడు. అప్పడు సునీల్ కు.. రాయ్ బరేలీకి చెందిన ఒక వ్యక్తి ఫోన్ మొబైల్ నంబర్ దొరికింది. రైతు వెంటనే ఆ నంబర్ కు కాల్ చేశాడు. సదరు వ్యక్తి.. కిసాన్ భయ్యా డైరీ ఫామ్ నడిపిస్తున్నానని, తన వద్ద మంచి జాతీకి చెందిన గేదెలున్నాయని సునీల్ తో చెప్పాడు.
అతని మాటలను పూర్తిగా నమ్మేశాడు. ఈ క్రమంలో.. సునీల్ తనకు మంచి జాతీ గేదెకావాలని డైరీ ఫామ్ వ్యక్తిని అడిగాడు. దీనికి ఒకే చెప్పిన వ్యక్తి.. గేదె ధరను 55,000 అని పేర్కొన్నాడు. అంతే కాకుండా.. ₹ 10,000 అడ్వాన్స్‌గా చెల్లించాలని డిమాండ్ చేశాడు. గేదెను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న పాల వ్యాపారి వెంటనే ఆ మొత్తాన్ని బదిలీ చేశాడు. డెలీవరీ అయ్యాక మిగతా డబ్బులు చెల్లించాలని కోరాడు.
ఇది నమ్మిన సదరు రైతు.. మరుసటి రోజు గేదె వస్తుందని చాలా సేపు ఎదురు చూశాడు. మరుసటి రోజు గేదె రాకపోవడంతో మళ్లి డైరీ విక్రేతకు సునీల్ డయల్ చేశాడు. అయితే మరో ₹ 25,000 బదిలీ చేయమని అడిగాడు. కానీ అప్పటికే రైతుకు ఇతని పట్ల అనుమానం కల్గింది.
సునీల్ గట్టిగా నిలదీయడంతో అవుతలి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దీంతో తాను మోసాపోయాయని గుర్తించిన రైతు పోలీసుల దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook