Mohanlal - Malaikottai Vaaliban: మన దేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్‌లాల్‌కు ఒకరు. ఒక వైపు కమర్షియల్ హీరోగా రాణిస్తూనే.. తనలోని ఉన్న నటుడిని తృప్టి పరచడానికి కళాత్మక చిత్రాల్లో నటిస్తూ జాతీయ స్థాయి నటుడిగా ఎదిగారు. మోహన్‌లాల్ మలయాళ భాషకే పరిమితం కాకుండా.. తెలుగు, హిందీ సహా అన్ని ప్యాన్ ఇండియా భాష చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమాలతో కూడా మోహన్‌లాల్‌కు మంచి అనుబంధమే ఉంది. అప్పట్లో తన ప్రియమిత్రుడు తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ హీరోలుగా రోజా హీరోయన్‌గా నటించిన 'గాండీవం' సినిమాలో ఓ పాటలో మెరిసాడు. ఆ తర్వాత 'మనసంతా', ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్' సినిమాలతో పలకరించారు.
ఇక ఈయనకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. జనతా గ్యారేజ్ తర్వాత 'మన్యం పులి' సినిమాతో ఇక్కడ కూడా మంచి హిట్ అందుకున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. రీసెంట్గా ఈయన 'మలైకోట్టై వాలిబన్'(Malaikottai Vaaliban) సినిమాతో పలకరించారు. బాహుబలితో పోలిక పెట్టి ఈ సినిమాకు భారీ హైపు తీసుకొచ్చారు. తీరా విడుదలయ్యాక గాలి తీసిన బెలూన్లా తుస్సుమంది.బాహుబలి సక్సెస్ తర్వాత ఈ రేంజ్లో అన్ని ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కినా.. అందులో ఏదో ఒకటి అర మినహా పెద్దగా సక్సెస్ అయినా దాఖలాలు లేవు. అంతేకాదు బాహుబలి మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాయి.
ఇక మలైకోట్టై వాలిబన్ కంటే ముందు మమ్మట్టి.. 'మామంగం' అనే భారీ బడ్జెట్ సినిమా తీయగా అది కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఆ తర్వాత అరేబియా సముద్ర సింహం అంటూ 'మరక్కర్' మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిల బడింది. ఈ మూవీకి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంతో పాటు పలు అవార్డులు కూడా వచ్చాయి. కానీ కీలకమైన ప్రేక్షకాదరణ పొందలేదు.
రిపబ్లిక్ డే కానుకగా విడుదలైన 'మలైకోట్టై వాలిబన్' చిత్రానికి తొలి రోజు ఓ మోస్తరు టాక్ సొంతం చేసుకుంది. వీకెండ్ వరకు పర్వాలేదనిపించిన ఈ మూవీ ఆ తర్వాత నెమ్మదిగా డౌన్ అయింది. ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో లేకపోవడం.. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో అది కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ. 12 కోట్ల షేర్ (రూ. 25.50 కోట్ల గ్రాస్) వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఓవరాల్‌గా ఈ మూవీ క్లైమాక్స్‌కు పెద్ద అప్లాజ్ వచ్చినా.. సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోయే సరికి ఈ సినిమా మలయాళంలో పెద్ద డిజాస్టర్ అయ్యే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయి. మొత్తంగా మోహన్‌లాల్ అభిమానులు ఈ సినిమా విషయంలో అనుకున్నది ఒకటి అయితే.. అయింది మరొకటి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ
Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.