Garlic Juice For Cholesterol: ప్రస్తుతం చాలామంది ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఇష్టపడుతున్నారు. ఇవి నూటికి రుచిని అందించినప్పటికీ అనేక రకాల సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్ సైడ్ అతిగా తినడం వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. దీని కారణంగా గుండె సమస్యలతో పాటు అనేక రకాల ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీరంలోని పెరుగుతున్న కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
చెడు కొలెస్ట్రాల్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వెల్లుల్లి రెబ్బలు ప్రభావంతంగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించడమే.. కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చెడు కొవ్వు సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా తినడమే కాకుండా జ్యూస్‌లా తయారు చేసుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల అందులో ఉండే ఆయుర్వేద గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.
చాలామందికి తెలియని విషయమేమిటంటే కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగిస్తుందని వెల్లుల్లిని అతిగా తీసుకుంటున్నారు ఇటీవలే పరిశోధనాల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. అతిగా వెల్లుల్లిని తీసుకున్న వారిలో ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయట. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌లు కలిగించేందుకు వెల్లుల్లి పాత్ర చిన్నదేనని పరిశోధనల్లో వెల్లడించారు. కాబట్టి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి వెల్లుల్లిని తీసుకోవడమే కాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వెల్లుల్లి తీసుకోవడం వల్ల గుండె జబ్బుల పారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు ప్రత్యేకమైన ఆహారపు డైట్లను పాటించడమే కాకుండా వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అంతేకాకుండా వెల్లుల్లితో తయారుచేసిన రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతోపాటు పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter