Tamil Politics: దేశంలో తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. ఆ రాష్ట్ర రాజకీయాలను దాదాపుగా సినీ రంగానికి చెందినవారే శాసించారు. ఇప్పటికే దశాబ్దాల పాటు తమిళ రాజ్యాన్ని సినీ రంగ ప్రముఖులు పాలించారు. తమిళ రాజకీయాలు సినీ పరిశ్రమతో విడదీయలేనివి. తాజాగాఓ ఈ అనుబంధాన్ని మరింత పెంచేందుకు సూపర్ స్టార్ విజయ్ రాబోతున్నారని సమాచారం. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 25న తన అభిమానులతో కీలక సమావేశం నిర్వహించడం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టి పెట్టుకుని విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది.
తమిళ సినీ ప్రముఖుల్లో విజయ్ ఒకరు. తన సినిమాలతో కోట్లాది ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్‌కు ప్రజల్లో ఆదరాభిమానం విశేషంగా ఉంది. లక్షలాది సంఖ్యలో విజయ్‌కు అభిమానులు ఉన్నారు. పేరుకు అభిమానులే కాదు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ఆ అభిమానులంతా కలిసి 'విజయ్ మక్కల్ ఇయక్కం' అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తరచూ ఈ సంఘంతో విజయ్ సమావేశమవుతూ అభిమానులకు చేరువవుతుంటారు.
తాజాగా ఫిబ్రవరి 25న చెన్నెలోని పనయూర్‌లోని తన కార్యాలయంలో విజయ్ కీలక సమావేశం నిర్వహించారు. 'విజయ్ మక్కల్ ఇయక్కం' నిర్వాహకులతో విజయ్ చర్చించారు. వివిధ జిల్లాల నుంచి 150 మంది ఆ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. వారితో విజయ్ తన ఆలోచనలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఒక స్పష్టత వచ్చిందని సమాచారం. మరో నెలరోజుల్లో కొత్త పార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఇప్పటికే పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ ప్లాన్‌లో భాగమా..?
లోక్‌సభ ఎన్నికల్లో విజయ్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని.. దానికి కొత్త పార్టీతో ముందుకు వస్తున్నారని తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే విజయ్ వెనుకాల బీజేపీ ఉందని తెలుస్తోంది. తమిళనాడు ప్రజలు బీజేపీని ఆదరించడం లేదు. గతంలో ఏఐడీఎంకే మద్దతునివ్వగా.. ఇప్పుడు దూరమైంది. ఈ నేపథ్యంలో విజయ్ ద్వారా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బీజేపీ భారీ ప్రణాళిక రచించినట్లు చర్చ నడుస్తోంది. విజయ్ రాజకీయ ప్రవేశంపై కొన్ని రోజుల్లో ఒక స్పష్టత రానుంది. మరి విజయ్ ప్రవేశిస్తే తమిళ రాజకీయాల్లో ఓ భారీ మార్పు జరిగే అవకాశం ఉంది.
Also Read: KTR Republic Day: గవర్నర్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధమంటూ వ్యాఖ్యలు
Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook