Best Cars In India: రూ.20 లక్షల్లో ADAS టెక్నాలజీతో బెస్ట్ కార్లు ఇవే.. టాప్-5పై ఓ లుక్కేయండి

Cars Under Rs 20 Lakh With ADAS: ADAS టెక్నాలజీతో వచ్చే కార్లకు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ నెలకొంది. మీరు రూ.20 లక్షల బడ్జెట్ వరకు ADAS టెక్నాలజీ కార్లను కొనులోగు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. MG ఆస్టర్, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్, హోండా ఎలివేట్ తదితర కార్ల ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 20, 2024, 03:18 PM IST
Best Cars In India: రూ.20 లక్షల్లో ADAS టెక్నాలజీతో బెస్ట్ కార్లు ఇవే.. టాప్-5పై ఓ లుక్కేయండి

Cars Under Rs 20 Lakh With ADAS: అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీతో రహదారి భద్రతను పెంపొందించే దిశగా కీలకమైన ముందడుగు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అనేక లగ్జరీ కార్ల తయారీదారులు తమ మోడళ్లను డ్రైవర్ అసిస్టెన్స్ టెక్‌తో అందిస్తున్నా.. ఇప్పుడు పెద్ద కంపెనీలు కూడా తమ ఆఫర్‌లలో ADAS సూట్‌లను చేరుస్తున్నాయి. ADAS మన మార్కెట్లో చాలా కార్లలో అందుబాటులో ఉంది. మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తూ.. మీ బడ్జెట్ రూ.20 లక్షల వరకు ఉంటే ADASతో సిస్టమ్‌తో వచ్చే మంచి కార్లు ఉన్నాయి. ఆ లిస్ట్‌పై ఓ లుక్కేయండి. 

MG ఆస్టర్ 

మన దేశంలో లెవెల్ 2 ADASని మొదట MG ఆస్టర్ మోడల్‌తో పరిచయం చేశారు. మిడ్-సైజ్ SUV ప్రస్తుతం ప్రారంభ ధర రూ.10.82 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతోంది. ఆస్టర్ ADAS సూట్ లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ఫార్వర్డ్ కొలిషన్ ప్రివెన్షన్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 14 ఫీచర్లను అందిస్తుంది.

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్

అప్‌డేట్ చేసిన హోండా సిటీ  2023 మార్చి నెలలో ప్రారంభమైంది. అంతకుముందు హైబ్రిడ్ వర్షన్‌లో అందుబాటులో ఉండగా..  ADAS హోండా సిటీ రెండవ బేస్ V వేరియంట్ నుంచి అందుబాటులో ఉంది. దీని ధర రూ.11.71 లక్షల నుంచి రూ. 16.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. పెట్రోల్ వేరియంట్‌లు కూడా డ్రైవర్ అసిస్టెన్స్ సూట్‌తో వస్తోంది. సిటీ సెడాన్ SV, V, ఎలిగెంట్ ఎడిషన్, VX, ZX అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్ఆయి.  

హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ వెర్నా మోడల్ కూడా భారత్‌లో మార్చి 2023లో దేశంలో ప్రారంభమమైంది. ఈ సెడాన్ నాలుగు వేరియంట్‌లు, తొమ్మిది కలర్స్‌ ఆప్షన్స్‌తో ప్రారంభ ధర రూ.10.96 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అనేక ఫీచర్లతోపాటు కొత్త వెర్నా హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ADAS టెక్‌తో కూడా ఈ కారులో ఉంది. సెక్యూరిటీ ఫీచర్స్‌లో ఫార్వర్డ్ కొలిషన్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, రియర్ క్రాస్ అసిస్ట్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, హై బీమ్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. 

హోండా ఎలివేట్

హోండా ఎలివేట్ SUV ఈ ఏడాది సెప్టెంబరులో మన దేశంలో ప్రారంభమైంది. ఈ కారు ధర రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మిడ్-సైజ్ SUV నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. SV, V, VX, ZX మోడల్స్‌లో ఉంది. ఎలివేట్ టాప్ ట్రిమ్ బ్రాండ్ 'హోండా సెన్సింగ్' ADAS సూట్‌తో వస్తుంది. సిటీ తర్వాత ఇది ADASతో పరిచయం చేసిన హోండా రెండో కారు. 

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ అమ్మకాలు జూలై 2023లో ప్రారంభమయ్యాయి. ఈ కారులో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి.  ADAS 17 ఫీచర్లతోపాటు ADAS టాప్-స్పెక్ GTX+,  X-లైన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కియా సెల్టోస్ ధర రూ.10.90 లక్షల నుంచి రూ. 20.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కొత్త 2024 హ్యుందాయ్ క్రెటా ధర రూ.10,99,900 నుంచి రూ.20,14,900 వరకు ఉంది. ఈ మోడల్ కారులో కూడా ADAS యాడ్ చేశారు. కొత్త క్రెటా డెలివరీ ఈ నెలలోనే ప్రారంభమైంది. 

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News