AP Government: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పధకం పొరుగు రాష్ట్రం తెలంగాణలో సక్సెస్ కావడంతో ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది. మరో 4 నెలల్లో ఎన్నికల నేపధ్యంలో ఏపీలో ఈ పధకం అమలు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది ఏపీ ప్రభుత్వం.
ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అనేక సంక్షేమ పధకాలు అందిస్తోంది. ఇప్పుడు మరో పధకంపై సమాలోచన చేస్తోందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఢిల్లీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించింది ఆప్ ప్రభుత్వం. ఆ తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే హామీతో ఎన్నికల్లో విజయం సాధించి పధకం అమలు చేస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పధకాన్ని ఆరు గ్యారంటీల్లో ఒకటిగా చేర్చి ప్రారంభించింది. తెలంగాణలో ఈ పధకానికి విశేష ఆదరణ లభిస్తోంది. తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మహిళల్లో విశేషంగా స్పందన కన్పిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలో ప్రతిపక్షం తెలుగుదేశం మినీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది.
ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఈ పధకాన్ని ఏపీలో కూడా ప్రారంభించే ఆలోచనలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వంలో విలీనమైంది. మరో 4 నెలల్లో ఎన్నికల నేపధ్యంలో ముందే ఏపీలో ఈ పధకాన్ని ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాల్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అధికారులు ఈ విషయంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీ రాబడి ఎంతవరకూ తగ్గుతుందనే కోణంలో లెక్కలేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 40 లక్షలమంది ప్రయాణిస్తుంటే అందులో 15 లక్షల వరకూ మహిళలుంటారని అంచనా ఉంది. అన్ని రకాల పాస్‌లు కలిగిన విద్యార్ధినులు, మహిళలు 3-4 లక్షల మంది ఉంటారు. ప్రస్తుతం ఆర్టీసీకు రోజుకు వస్తున్న 17 కోట్ల ఆదాయంలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తే 6 కోట్ల వరకూ ఆదాయం తగ్గిపోవచ్చు. ఈ 6 కోట్లను భరించే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా లేదా, ఏం చేయాలనేది అధ్యయనం జరుగుతున్నట్టు సమాచారం.
అన్నీ అనుకూలిస్తే ఏపీ ప్రభుత్వం త్వరలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించి సంక్రాంతి నాటికి అమలు చేయవచ్చు. అంటే ఏపీలో మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఉచిత మహిళా బస్సు ప్రయాణం కల్పించవచ్చని తెలుస్తోంది.
Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook