Ganesh Chaturthi 2022 Date: వినాయక చవితి ప్రత్యేకత, విగ్రహా ప్రతిష్ఠి సమయం, చవితి ప్రత్యేక తిథులు!

Ganesh Chaturthi Start Date 2023: వినాయక చవితి రోజు మండపాల్లో విగ్రహాలకు ప్రతిష్ఠించేవారు తప్పకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపిన సమయాల్లో పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 10:21 AM IST
Ganesh Chaturthi 2022 Date: వినాయక చవితి ప్రత్యేకత, విగ్రహా ప్రతిష్ఠి సమయం, చవితి ప్రత్యేక తిథులు!

Ganesh Chaturthi 2023 Time And Date: భారత్‌తో ఎంతో పవిత్రంగా జరుపుకునే పండగల్లో గణేష్‌ చతుర్థి ఒకటి. ఈ పండగను భాద్రపద మాసం, శుక్ల పక్ష చతుర్థి తేదీన జరుపుకుంటారు. ఈ పండుగ శుక్ల పక్ష చతుర్థి రోజు ప్రారంభమై..అనంత చతుర్దశి రోజు ముగుస్తుంది. ఈ పండగను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 19న గణేష్ పండగ వస్తోంది. కానీ కొన్ని గ్రహాల కలయిక కారణంగా గణపతి ప్రతిష్ఠాపన సమయంలో మార్పలు చేర్పులు ఉండే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు ఏయే సమయాల్లో గణపతి ప్రతిష్ఠాపన చేయడం మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

భారత్‌ వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. యువత ఎంతో ఉత్సహంతో డప్పు వాయిద్యాలతో గణేషుడి విగ్రహాన్ని మండపాల వద్దుకు తీసుకువస్తారు. అంతేకాకుండా యువత ఈ సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. అయితే మండపాల్లో గణేష్‌ విగ్రహాలను ప్రతిష్ఠించే సమయంలో ఈ ప్రత్యేక ఆచార వ్యవహారాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

ఈ సమయాలు చాలా అనుకూలమైనవి:
చతుర్థి తిథి 18 సెప్టెంబర్ 2023న మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 01:43 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గణపతి ప్రతిష్ఠాపనకు లేదా పూజకు అనుకూలమైన సమయం ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 01:28 వరకు ఉంటుంది. ముహూర్తపు మొత్తం వ్యవధి 02 గంటల 27 నిమిషాలు పాటు ఉండబోతోందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ సమయంలో పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు:
వినాయ చవితి ఒక రోజు ముందు చంద్రుడిని చూడకూడదని పూరణాల నుంచి ఆనవాయితిగా వస్తోంది. సెప్టెంబర్ 18 రోజున మధ్యాహ్నం 12:39 నుంచి రాత్రి 08:10 వరకు చంద్రుడిని చూడకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం కాలం వ్యవధి 10 గంటల 59 నిమిషాలు పాటు ఉంటుంది. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News