Saturn Retrograde 2023 effect: జాతకంలోని గ్రహాలు, రాశులు స్థానాలను బట్టే భవిష్యత్తును చెబుతుంటారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. గ్రహాలు కాలనుగుణంగా రాశులను మార్చడం, ఉదయించడం, అస్తమించడం మరియు తిరోగమించడం చేస్తాయి. గ్రహాల యెుక్క కదలిక ప్రతి మనిషిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని ఆ విధంగా పిలుస్తారు. పురాణాల ప్రకారం, శనిదేవుడు సూర్యదేవుడు కుమారుడు. ఈ రెండు గ్రహాలను శత్రుగ్రహాలుగా పిలుస్తారు.
శనిదేవుడి అనుగ్రహం ఉన్నవారు కింగ్ లా బతుకుతారు. ఈయన చెడు దృష్టి ఏ వ్యక్తిపై పడుతుందో వారి జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ప్రస్తుతం శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో జూన్ 17న శని గ్రహం తిరోగమనం చేసింది. సాధారణంగా గ్రహాలు తిరోగమనం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. శని రివర్స్ కదలిక కూడా మేషం, కర్కాటకం, కన్య మరియు వృశ్చిక రాశి వారిపై చెడు ప్రభావాన్ని చూపనుంది. ఈ సమయంలో శనిదేవుడి వక్ర దృష్టి మీపై పడకుండా ఉండాలేంటో కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
పరిహారాలు
** శనీశ్వరుడి కోపం తగ్గించాలన్నా, శుభ ఫలితాలు పొందాలన్నా ప్రతిరోజూ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు దూరమవుతాయి.
** శనిదేవుడి ప్రతికూల ప్రభావం మీపై పడకుండా ఉండాలంటే నిత్యం హనుమంతుడిని పూజించండి. దీంతోపాటు భైరవుడిని ఆరాధించడం వల్ల కూడా మీరు మంచి ఫలితాలను పొందుతారు.
** శని యొక్క చెడు ప్రభావం మీపై పడకుండా ఉండాలంటే మీరు పెద్దలను గౌరవించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అవసరమైన వారికి ఆహారం, డబ్బు మరియు బట్టలు మొదలైనవి దానం చేయండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరేలా చేస్తాడు.
** మీ జాతకంలో శని దోషం పోవాలంటే నిత్యం కాకులకు రొట్టెలు తినిపించండి. దీంతోపాటు మీ నీడను దానం చేయండి. శనిదేవుడికి ఇష్టమైన శనివారం నాడు ఈ పరిహారం చేస్తే మంచిది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Surya Transit 2023: ఆగస్టు 17న సొంత రాశిలోకి గ్రహాల రాజు.. ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి