New Parliament Building: పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి టీడీపీ.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

TDP To Attend New Parliament Building Inauguration Ceremony: ఢిల్లీలో ఈ నెల 28న నిర్వహించనున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి టీడీపీ హాజరుకానుంది. ఏపీ నుంచి అధికార, విపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరకానుండడం విశేషం. కాగా.. దేశంలోని కాంగ్రెస్‌తో సహ 19 పార్టీలో ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : May 25, 2023, 05:33 PM IST
New Parliament Building: పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి టీడీపీ.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

TDP To Attend New Parliament Building Inauguration Ceremony: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని దేశంలోని 19 విపక్ష పార్టీలు బహిష్కరించిన విషయం తెలిసిందే. నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఈ నెల 28 జరగనున్న ప్రారంభోత్సానికి హాజరుకాబోమంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ఎలాంటి విలువల కనిపించడం లేదని విమర్శించాయి. ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తుండడంపై పెద్ద చర్చే జరుగుతోంది.

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ వేడుకకు హాజరవుతున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించగా.. తెలుగుదేశం పార్టీ కూడా హాజరుకానుంది. ఈ మేరకు టీడీపీ ప్రకటన విడుదల చేసింది. "పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి టీడీపీ హాజరవుతుంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు హాజరవుతారు.." అని పార్టీ ప్రకటనలో పేర్కొంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై స్పందించారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించుకోవడం దేశానికి గర్వకారణం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి  శుభాకాంక్షలు చెప్పారు. ఈ చారిత్రక నిర్మాణంలో భాగమైన వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. 

పార్లమెంట్  భవనంలో  దేశానికి మలుపుతిప్పే నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదరికం లేని దేశం నిర్మూలన దిశగా అడుగులు పడతాయని..  దనికులు, పేదలమధ్య అంతరం తగ్గిపోవాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లయిన సందర్భంగా 2047 కల్లా దీన్ని సాధించాలన్నారు. కొత్త పార్లమెంట్ భవనం పరివర్తన విధానానికి.. దేశాన్ని మలుపు తిప్పే నిర్ణయాలకు వేదిక కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి పేదరికం లేని దేశంగా భారత్ అవతరించాలని ఆకాంక్షించారు. పేదరిక నిర్మూలన దిశగా అడుగులు పడాలని అన్నారు. అయితే విపక్షాలు చేస్తున్న విమర్శలపై చంద్రబాబు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పార్టీ తరుఫున ఎవరు హాజరవుతారనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. 

 

అత్యాధునిక వసతులతో.. అద్భుతమైన డిజైన్‌తో పార్లమెంట్ నూతన భవనాన్ని నిర్మించారు. కొత్త పార్లమెంట్ సిద్ధం కావడంతో ఈ నెల 28న ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న భవనం పక్కనే.. నూతన పార్లమెంట్‌ను నిర్మించారు. ఈ కొత్త భవనంలో లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది కూర్చునే విధంగా సిటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. పాత భవనంలో 543 మంది లోక్‌సభలో.. 250 మంది రాజ్యసభలో కూర్చునేందుకు అవకాశం ఉంది. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు.

Also Read: Group-1 and Group-2 Notification: గ్రూప్‌-1, 2 ఉద్యోగార్ధులకు శుభవార్త.. అతి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల  

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News