Rs 2000 Notes Viral Video: పెట్రోల్ పోసుకుని 2 వేల నోటు ఇచ్చాడనే కోపంతో.. వైరల్ వీడియో

Rs 2000 Notes Viral Video: ఆర్బీఐ 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు చేసిన ప్రకటనతో దేశం నలుమూలలా రకరకాల ఘటనలు చోటచేసుకుంటున్నాయి. కొంతమంది ఆ నోట్లను తీసుకోవడానికి తిరస్కరించే క్రమంలో జరిగిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. అదేంటో మీరే చూడండి. 

Written by - Pavan | Last Updated : May 24, 2023, 07:33 PM IST
Rs 2000 Notes Viral Video: పెట్రోల్ పోసుకుని 2 వేల నోటు ఇచ్చాడనే కోపంతో.. వైరల్ వీడియో

Rs 2000 Notes Viral Video: ఆర్బీఐ 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు చేసిన ప్రకటన దేశంలో కొన్ని అనూహ్య పరిణామాలకు దారితీస్తోంది. తమ వద్ద ఉన్న 2 వేల నోటును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కానీ లేదా బ్యాంకులో మార్పిడి చేసుకోవడానికి కానీ అవకాశం ఉండగా.. కొంతమంది ఈ రెండు మార్గాలు కాకుండా ఆ రెండు వేల రూపాయల నోట్లను షాపింగ్ మాల్స్‌లోనో లేక పెట్రోల్ బంకుల్లోనూ పేమెంట్స్ కింద చెల్లించి ఆ నోట్లను వదిలించుకోవడమో లేక మార్పిడి చేసుకోవడమో చేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోలో ఏముందంటే.. పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం వచ్చిన ఒక స్కూటరిస్ట్.. పెట్రోల్ ఫిల్ చేయించుకున్న అనంతరం పెట్రోల్ కోసం రూ. 2 వేల నోటు తీసిచ్చాడు. ఆ నోటును తీసుకోవడానికి నిరాకరించిన పెట్రోల్ బంక్ వర్కర్.. 2 వేల నోటుకు బదులు మరో నోటు ఇవ్వాల్సిందిగా కోరాడు. కానీ తన వద్ద మరో నోటు ఏదీ లేదని.. 2 వేల నోటునే తీసుకోవాలని కస్టమర్ చెప్పడంతో ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. పెట్రోల్ బంక్ వర్కర్ అడిగినట్టుగా కస్టమర్ మరో నోటు ఇవ్వలేకపోవడంతో.. అతడిపై ఆగ్రహం వ్యక్తంచేసిన బంక్ వర్కర్.. స్కూటర్లో కొట్టిన పెట్రోల్ ని తిరిగి పైప్ తో పీల్చి ఖాళీ చేశాడు. 

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో ఆ పెట్రోల్ బంక్ మేనేజర్ ఈ ఘటనపై స్పందించాడు. ఆర్బీఐ 2 వేల రూపాయల నోట్లపై ప్రకటన చేయడానికి ముందు తమకు రోజు మొత్తంలో కేవలం ఒకటో లేక రెండో నోట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఆర్బీఐ ప్రకటన అనంతరం తమకు నిత్యం 70 వరకు రూ. 2 వేల నోట్లు వస్తున్నాయని చెప్పుకొచ్చాడు. అందులో కొంతమంది కేవలం 50 రూపాయల పెట్రోల్ కోసం 2 వేల నోట్లు ఇస్తున్నారని.. అందుకే తాము ఆ నోట్లను తిరస్కరిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చదవండి : House for Sale for Just Rs 89: అవును.. 89 రూపాయలకే ఇల్లు కొనే ఛాన్స్..

రూ. 2 వేల నోట్లు ఇచ్చే వాళ్లు ఎక్కువ మొత్తంలో పెట్రోల్ పోయించుకుంటే తమకు అభ్యంతరం లేదు కానీ ఒకట్రెండు లీటర్ల పెట్రోల్ పోసుకుని 2 వేల రూపాయల నోట్లు ఇవ్వడం వల్లే తమకు ఇబ్బంది ఎదురవుతోంది అని పెట్రోల్ బంక్ మేనేజర్ రాజీవ్ గిర్హోత్రా తెలిపారు.

ఇది కూడా చదవండి : Tiger Dog Viral Video: పులి చెవి కొరికేసిన కుక్క.. పక్కనే సింహం! ఫన్నీ వీడియో

ఇది కూడా చదవండి : Leopard Attack Viral Videos: అడుగులో అడుగేసుకుంటూ సైలెంటుగా వచ్చిన చిరుత.. అక్కడే నిద్రిస్తున్న వ్యక్తి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News