Weight loss Tips: ఈ విత్తనాలు మీ డైట్‌లో చేరిస్తే వారం రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం

Weight loss Tips: స్థూలకాయం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గేందుకు వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే కొన్ని రకాల విత్తనాలతో కేవలం వారం రోజుల్లోనే బరువు తగ్గవచ్చంటే నమ్ముతారా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 1, 2022, 05:59 PM IST
Weight loss Tips: ఈ విత్తనాలు మీ డైట్‌లో చేరిస్తే వారం రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం

Weight loss Tips: స్థూలకాయం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గేందుకు వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే కొన్ని రకాల విత్తనాలతో కేవలం వారం రోజుల్లోనే బరువు తగ్గవచ్చంటే నమ్ముతారా..

రోజురోజుకూ పెరుగుతున్న బరువు అందరికీ సమస్యగా మారుతోంది. బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా వ్యాయామానికి కూడా సమయం ఉండటం లేదు. ఫలితంగా బరువు తగ్గించలేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మీ డైట్ సరిగ్గా ఉంటే కచ్చితంగా బరువు తగ్గించుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్‌లో హెవీ ఫుడ్ కాకుండా..తేలికపాటి విత్తనాలు కొన్ని చేర్చితే అద్భుతమైన ఫలితాలుంటాయి. స్తూలకాయం నుంచి గట్టెక్కవచ్చు. బరువు తగ్గేందుకు ఏయే విత్తనాలు డైట్‌లో చేర్చాలో తెలుసుకుందాం..

ఫ్లెక్స్ సీడ్స్

ఫ్లెక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ శరీరంలోని ఫ్యాట్ కరిగించేందుకు దోహదపడుతుంది. ఇంకా ఇందులో ఉండే ఐరన్, ప్రోటీన్, ఫైబర్ కారణంగా ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే ఫ్లెక్స్ సీడ్స్ క్రమం తప్పకుండా డ్రింక్స్, సూప్ లేదా కూరగాయల్లో కలిపి తీసుకోవాలి,

సన్‌ఫ్లవర్ సీడ్స్

బరువు తగ్గించేందుకు సన్‌ఫ్లవర్ సీడ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ విత్తనాల్ని సలాడ్ లేదా సూప్ రూపంలో తీసుకోవచ్చు. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో హై కేలరీలు బర్న్ అవుతాయి. ఫలితంగా మీ బరువు వేగంగా తగ్గుతుంది. 

చియా సీడ్స్

చియా సీడ్స్ అనేది బరువు తగ్గేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి మీ ఆకలిని తగ్గించడంలో దోహదపడతాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే..డైట్‌లో చియా సీడ్స్ చేర్చాలి.

Also read: Uric Acid Problem: మీ శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉందా..డైట్‌లో ఈ మార్పులు చేస్తే చాలు>

 స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News