పాస్తా ఎన్ని సార్లు తిన్నా ఇంకా తినాలి అనిపించే టేస్టీ ఫుడ్. పైగా కరోనావైరస్ వల్ల ( Coronavirus ) వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్య ఎక్కువ అయ్యాక.. ఇంట్లో పాస్తా చేసుకోవడం మరీ పెరిగింది. అందుకే ఈసారి అదే పాస్తాను కాస్త కొత్తగా ట్రై చేద్దాం. ట్యాంగీ టమాటో తో పాటు పోషకాలు ఉన్న పాస్తాను ఇలా సిద్ధం చేద్దాం. ఆరోగ్యకరమైన ( Health ) జీవితానికి కావాల్సిన రుచిని ఎంజాయ్ చేద్దాం.
-
N-95 Mask: ఎన్ 95 మాస్కును ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఇలా క్లీన్ చేయోచ్చు
-
Health: జీలకర్రతో ఆరోగ్యం మరింత పదిలం
ఇవి కావాలి:
- టోమాటో -4 ( వీటిని ముక్కలు చేసుకోవాలి )
- ఉడికించిన పాస్తా -2 బౌల్స్ నిండా
- ఉల్లిపాయ- ఒకటి
- గ్రేటెడ్ చీజ్-3 చెంచాలు
- ఉప్పు, మిరియాలు -రుచికి తగిన విధంగా
- పచ్చి మిరపకాయల-2
- వెన్న- రెండు చెంచాలు
-
Viral Video: ఈ వీడియోలో చిరుత ఎక్కడుందో కనుక్కోగలరా ? ట్రై చేయండి
ఇలా చేయాలి:
1. ఒక ప్యాన్ లో వెన్న వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి నిమిషం పాటు వేయించాలి
2. ఇందులో మిరపకాయలు, టోమాటోలు వేసి ఒక నిమిషం ఫ్రై చేయండి.
3. ఇప్పుడు ఉడికించిన పాస్తా, మిరియాల పొడి, ఉప్పు వేయండి
4. రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి కలుపుతూ.. చివరికి ఒక మైక్రో సేఫ్ బౌల్ లోకి తీసుకోండి.
5. పై భాగంలో చీజ్ వేసి దాన్ని ఒవెన్ లో 30 సెకన్ల పాటు ఉంచండి.
6. రుచికరమైన టోమోటా ట్యాంగో పాస్తా రెడీ.