COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం CoWin యాప్‌లో ఇలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి

COVID-19 Vaccine Appointment : కరోనా వైరస్ కట్టడిలో మనం భాగస్వాములు కావాలంటే కచ్చితంగా కోవిడ్19 టీకా తీసుకోవాల్సిందేనని వైద్యులు, వైద్య శాఖ నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కొవిన్ యాప్ లేదా వెబ్‌సైట్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Written by - Shankar Dukanam | Last Updated : May 13, 2021, 04:16 PM IST
COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం CoWin యాప్‌లో ఇలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి

How To Register For COVID-19 Vaccine : దేశంలో కరోనా కట్టడిలో భాగంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డోసుల మోతాదు నిల్వలు అధికంగా ఉన్నట్లయితే 18 నుంచి 44 ఏళ్ల వారికి టీకాలు ఇస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాలైతే 45 ఏళ్లు పైబడిన వారిలోనూ కోవిడ్19 వ్యాక్సిన్ తొలి డోసు కోసం టీకా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు.

ఏది ఏమైతేనేం కరోనా వైరస్ కట్టడిలో మనం భాగస్వాములు కావాలంటే కచ్చితంగా కోవిడ్19 టీకా తీసుకోవాల్సిందేనని వైద్యులు, వైద్య శాఖ నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కొవిన్ యాప్ లేదా వెబ్‌సైట్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే కరోనా టీకాలు వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కనుక 18 ఏళ్లు దాటిన వారైతే మీరు కూడా కోవిన్ యాప్ లేదా వెబ్‌సైట్ లేదా ఆరోగ్యసేతు యాప్ ద్వారా కోవిడ్19(COVID-19) టీకా తీసుకునేందుకు రిజిస్టర్ చేసుకుంటే త్వరలోనే వ్యాక్సిన్ లభిస్తుంది.

Also Read: Covishield Dose Schedule: కోవిషీల్డ్ డోసేజ్ షెడ్యూల్ మరోసారి మార్చిన కేంద్రం

వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునే విధానం ఇది..
1. వ్యాక్సిన్ స్లాట్స్ ప్రతిరోజు సాధారణంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో యాడ్ చేస్తారు. ఆ సమయంలో కోవిన్(CoWIN) పోర్టల్‌లో స్లాట్ కోసం సెర్చ్ చేయాలి.

2. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాక్సిన్ తీసుకునేందుకు స్లాట్ చెక్ చేయాలి. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం త్వరగా పూర్తవుతుంది. 

3. ఆరు అంకెల మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి లేదా మీ రాష్ట్రం పేరు, జిల్లాలను డ్రాప్‌డౌన్ ద్వారా సెలక్ట్ చేయాలి. ఆ తరువాత మీకు దగ్గర్లోని వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంచుకుంటే సరి. 

Also Read: Dead Bodies In Ganga: నదిలో COVID-19 మృతదేహాలు, వైరస్ వ్యాప్తిపై నిపుణులు ఏమన్నారంటే

కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ విధానం..
1. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, Get OTP ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని టైప్ చేసి ఎంటర్ చేయాలి

2. Register for Vaccination పేజీ మీద క్లిక్ చేయాలి. అనంతరం ఫొటో ఐడీప్రూఫ్, పేరు, జెండర్, పుట్టిన సంవత్సరం లాంటి వివరాలు నమోదు చేయాలి. మీరు విజయవంతంగా రిజిస్ట్రేషన్ అయ్యారని మీ మొబైల్‌కు మెస్సేజ్ వస్తుంది.

3. అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకునేందుకు Schedule Next మీద క్లిక్ చేయాలి

4. మీ ఏరియా పిన్ కోడ్ (6 అంకెలు) టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. మీరు ఇచ్చిన పిన్ కోడ్ ప్రాంతంలోని కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు కనిపిస్తాయి.

5. తేదీ మరియు సమయం ఎంచుకుని Confirm option మీద క్లిక్ చేయాలి. ఒక లాగిన్ నెంబర్‌తో మొత్తం నలుగురికి వ్యాక్సిన్ రిజిష్ట్రేషన్ చేసే సదుపాయాన్ని కోవిన్ వెబ్‌సైట్ (CoWIN Website) కల్పిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News