Mango Paratha: మ్యాంగో పరాఠా ఇలా చేసుకుంటే ఎంతో రుచి.. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..

Mango Paratha Recipe: మామిడి పండ్లు అందరికీ ఇష్టం. ఎండకాలం మామిడి పండ్లు విపరీతంగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మామిడిపండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jun 13, 2024, 09:43 AM IST
Mango Paratha: మ్యాంగో పరాఠా ఇలా చేసుకుంటే ఎంతో రుచి.. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..

Mango Paratha Recipe: మామిడి పండ్లు అందరికీ ఇష్టం. ఎండకాలం మామిడి పండ్లు విపరీతంగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మామిడిపండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది పోషకాలకు నిధి క్యాలరీలు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి మామిడి పండ్లు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఒక కప్పు మామిడి పండ్ల ముక్కల్లో 99 క్యాలరీలు, 2.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మ్యాంగో తింటే బరువు పెరుగుతారని అపోహ ఉంటుంది. మామిడిపండు తింటే ఏదైనా సమస్య కాకుండా ఉంటుంది. ముఖ్యంగా మామిడిపండ్లలో అనేక రకాలు ఉంటాయి. మామిడిపండులో బంగిని పల్లి, తోతాపరి వంటి రకాలు ఉంటాయి. మామిడి పండు తో పచ్చడి మ్యాంగో జ్యూస్ మ్యాంగో రసం వంటివి తయారు చేసుకుంటాం. అయితే ఇప్పటివరకు మీకు తెలియని ఒక నిజం ఉంది మ్యాంగో తో పరోటా కూడా తయారు చేసుకోవచ్చు.

మామిడిపండ్లలో రుచి అద్భుతంగా ఉంటుంది రెగ్యులర్ గా ఒకే రకం చపాతీ, పూరి తిని విసిగిపోయినట్లయితే ఈసారి మ్యాంగో తో ప్యూరీ తయారు చేసుకోండి. లేకపోతే పరాటా ట్రై చేయండి పరాటా అంటే ఎక్కువ మందికి ఇష్టం ఉంటుంది. మ్యాంగో పరోటా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనితో రుచి అద్భుతంగా ఉంటుంది. వీకెండ్ బ్రేక్ ఫాస్ట్ లో కూడా వీటిని తీసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది దీనికి ముందుగా మ్యాంగో ప్యూరీ తయారు చేసుకోవాల్సి ఉంటుంది మ్యాంగో పల్ప్‌ తీసి బ్లెండ్ చేసుకోవాలి. ఒక మిక్సర్ లో ఆ తర్వాత ఏ వస్తువులు కావాలో తెలుసుకుందాం.

మ్యాంగో పరోఠాకు కావలసిన పదార్థాలు..
గోధుమపిండి -ఒక కప్పు 
పండిన మామిడి పండ్లు -1
యాలకుల పొడి -1/4 టీ స్పూన్ 
కారం -1/4 టీ స్పూను 
ఉప్పు -రుచికి సరిపడా 
నెయ్యి లేదా నూనె

ఇదీ చదవండి: ఈ 5 వంటగది వస్తువులతో మీకు నిత్యయవ్వనం ఖయాం..

మ్యాంగో పరోఠా తయారీ విధానం..
ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమపిండి నీళ్లు వేసి చపాతి పిండిలా తయారు చేసుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మ్యాంగో ప్యూరీ కూడా వేయాలి. ఆ తర్వాత యాలకుల పొడి, కారం వేసి గోధుమపిండి ముద్దను తయారు చేసుకోవాలి. దీన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఇదీ చదవండి: ఇంట్లోనే ఈ నీటిని తాగుతూ ఈజీగా బరువు తగ్గండి..

ఇప్పుడు ఈ గోధుమ పిండి ముద్దలను నిమ్మకాయ సైజులో బాల్స్ లా తయారు చేసుకోవాలి. పరోఠా తయారు చేసుకోవడానికి ఒక ముద్ద తీసుకుని చిన్న చిన్న సర్కిల్ షేప్ లో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసుకుంటూ పరాఠా రూపంలో తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి పరోటా వేసుకోవాలి. పరోటాని రెండు వైపులా బాగా కాల్చుకొని నెయ్యి లేదా నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ రుచికరమైన వేడివేడి మ్యాంగో పరాటాను ఇంటి సభ్యులతో ఆస్వాదించండి అయితే ఈ పరోటా ముద్ద తయారు చేసేటప్పుడు ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇందులో మ్యాంగో ప్యూరీ వేసుకుంటాం అందులో నీరు ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News