Belly Fat: అయితే ఇటీవలి కాలంలో జీవనశైలి కావచ్చు లేదా చెడు ఆహారపు అలవాట్లు కావచ్చు బెల్లీ ఫ్యాట్ సమస్య పెరిగిపోతోంది. అంటే పొట్ట పెరగడం లేదా నడుము చుట్టూ కొవ్వు పెరగడం. ఇది కేవలం అరోగ్యంపై ప్రభావం చూపించడమే కాకుండా నలుగురిలో అసౌకర్యం కల్గిస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుుడు తెలుసుకుందాం..
అధిక బరువు, స్ఖూలకాయం, బెల్లీ ఫ్యాట్ అనేవి ఆరోగ్యానికి మంచివి కావు. మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు లేదా చెడు అలవాట్ల కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటుంది. నడుము చుట్టూ బెల్లీ ఫ్యాట్ పెరగడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. అటు ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. స్థూలకాయం లేదా బెల్లీ ఫ్యాట్ సమస్య చాలా చికాకు కల్గిస్తుంటుంది. చాలామందిలో ఆత్మ విశ్వాసం కూడా పోతుంటుంది. అయితే అధిక బరువు అనేది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. చాలా రకాల అనారోగ్య సమస్యలు అధిక బరువు లేదా స్థూలకాయం కారణంగానే ఉత్పన్నమౌతుంటాయి. శరీరం బరువు పెరగడానికి కారణం ప్రధానంగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. అందుకే వీటికి దూరంగా ఉంటే అన్నీ సెట్ అవుతాయి.
మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. అయినా వదిలిపెట్టరు. కొందరైతే బానిసలుగా మారిపోతుంటారు. ఈ సామాజిక రుగ్మత బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. ఆరోగ్యం పాడవుతుంటుంది. రోజూ మద్యపానం అలవాటుండేవారికి కడుపు, నడుము చుట్టూ బెల్లీ ఫ్యాట్ సమస్యగా మారుతుంది. క్రమంగా ఇది అంద వికారంగా కూడా మారుతుంది. అందుకే ఆల్కహాల్ అలవాటు వెంటనే మానాల్సి ఉంటుంది. లేకపోతే స్థూలకాయం మిమ్మల్ని నాశనం చేయవచ్చు.
చాలామందికి తెలిసిందే అయినా ఎవరూ పాటించని అలవాటు. వ్యాయామం లేదా వాకింగ్ చేయకపోవడం వల్ల శారీరక శ్రమ లోపించడంతో బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. దీనికితోడు ఆధునిక జీవనశైలిలో గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతోంది. శారీరక శ్రమ లేకపోతే కొవ్వు పేరుకుపోతుంది. క్రమంగా శరీరమంతా వ్యాపించి స్థూలకాయానికి దారితీస్తుంది. అందుకే తగిన సమయంలోనే ఈ సమస్యను అరికట్టగలగాలి. అందుకే రోడూ వాకింగ్ చేయడం, లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్లు వాడటం, రన్నింగ్ చేయడం, జాగింగ్ వంటివి అలవాటు చేసుకోవాలి. స్విమ్మింగ్ ఇంకా మంచి అలవాటు. మొత్తానికి జీవన విధానం మార్చుకోవడం ద్వారానే బరువు నియంత్రణ సాధ్యమౌతుంది.
టెన్షన్, ఒత్తిడికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండింటి కారణంగా కూడా స్థూలకాయం సమస్య తలెత్తుతుంది. ఒత్తిడి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆకలి పెరుగుతుంది. ఇది ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుంది. ఒత్తిడికి చాలా కారణాలుంటాయి. ఆఫీసులో టెన్షన్, బాధ్యతలు, కుటుంబ కలహాలు, పాత వైరం, ప్రేమ స్నేహంలో మోసపోవడం, పరీక్షల భయం ఇలా చాలా కారణాలుంటాయి. సాధ్యమైనంతవరకూ ఒత్తిడికి గురికాకుండా ఉంటే మంచిది.
Also read: Diabetes Control Tips: బ్లడ్ షుగర్ స్పైక్ నిరోధించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook