Hair Spa at Home: జుట్టును అందంగా, ఆరోగ్యంగా చూసుకోవాలని అందరూ కోరుకుంటారు. దీనికి అనేక చర్యలు తీసుకుంటాం. మంచి షాంపూ, కండీషనింగ్, సీరం, హెయిర్ స్పా ఇలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే, వారానికి రెండుసార్లైనా ఆయిల్ కూడా హెయిర్ కు అప్లై చేయాలి అని సౌందర్య నిపుణులు చెబుతారు. ఈరోజు ఇంట్లోనే మనం హెయిర్ స్పాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది కెమికల్ ఫ్రీ..
ఇంట్లోని కొన్ని వస్తువులతో హెయిర్ స్పా తయారు చేసుకోవచ్చు. ఇవి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వీటిలో ఎలాంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉండవు. అవేంటో తెలుసుకుందాం.
మనకు తరచూ జుట్టు సమస్యలు వేధిస్తుంటాయి. వర్క్ స్ట్రెస్, ఆరోగ్య సమస్యలు వంటివి ప్రధాన కారణాలు. అయితే, వారానికొ ఒకసారి గ్రీన్ టీ మస్క్ వాడండి. గ్రీన్ టీ బ్యాగులను బాయిల్ చేసి, చల్లారిన తర్వాత ఓ స్ప్రే బాటిల్లోకి తీసుకోవలి. ఇప్పుడు ఆ నీటిని తలంతా స్ప్రే చేసుకోవాలి. కాసేపు సున్నితంగా మర్ధనా చేయాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల జుట్టు నిగారింపు కూడ సంతరించుకుంటుంది.
ఇదీ చదవండి: మీ పిల్లలకు జ్ఞాపకశక్తి తక్కువగా ఉందా? ఈ చిట్కాతో వారి మెదడు కంప్యూటర్ లాగా పనిచేస్తుంది..
మన అందరి ఇళ్లలో బియ్యం కడిగి నీరు ఉంటుంది. ఈ నీళ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ రైస్ వాటర్ ను స్టోర్ చేసుకుని మరుసటి రోజు హెయిర్ వాష్ చేసుకుంటే మంచిది. ఈ నీరు ఎంతో మంది ఫాలో అవుతోంది కూడా. జుట్టును ఆరోగ్యవంతంగా చేయడంలో బియ్యం నీరు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో రైస్ బేస్ షాంపూలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రైస్ వాటర్ స్ప్రేబాటిల్లో వేసుకుని జుట్టంతా స్ప్రే చేసుకోవాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.
ఇదీ చదవండి: Waxing Precautions: వ్యాక్సింగ్ చేశాక అస్సలు చేయకూడని 5 పొరపాట్లు ఇవే
కలబంద కూడా నిర్జీవ జుట్టుకు జీవన్నిస్తాయి. ఇది హెయిర్ మాయిశ్చరైజర్. కలబందను కూడా జుట్టును స్పా చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇంట్లో కలబంద ,ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్‌ని అప్లై చేయండి. ముఖ్యంగా దీనికి బాగా పండిన అరటిపండును ఒకటి తీసుకోండి. దీనికి సమపాళ్లలో అలోవెరా జెల్ ,ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook