Lady Aghori Vs CM Revanth reddy: బిడ్డా.. రేవంత్.. నిన్ను ఎలా దించాలా నాకు తెల్సు.. మళ్లీ రెచ్చిపోయిన లేడీ అఘోరీ..

AGhori fires on Revanth reddy: లేడీ అఘోరీ సీఎం రేవంత్ రెడ్డిపై మళ్లీ రెచ్చిపోయింది. తెలంగాణలో వరుసగా గుడులు ధ్వంసమైన ఏంచేస్తున్నావని ఏకీపారేసినట్లు తెలుస్తొంది. నిన్ను కూర్చి నుంచి ఎలా దింపాలో తనకు తెలుసని కూడా లేడీ అఘోరీ కీలక వ్యాఖ్యలు చేసింది.

1 /6

లేడీ అఘోరీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఏపీలోని ఆలయాలను సందర్శిస్తు లేడీ అఘోరీ బిజీగా ఉన్నట్లు తెలుస్తొంది. ఇటీవల శ్రీ కాళ హస్తీశ్వర ఆలయం, ఆతర్వాత శ్రీశైలం ఆలయాలను అఘోరీ దర్శించుకుంది.  

2 /6

అంతే కాకుండా.. ఆమె కర్నూల్ లో.. నెలపై కూర్చుని అన్నంలో మట్టి కల్పుకుని మరీ తినేసింది. ఈ నేపథ్యంలో లేడీ అఘోరీ ప్రస్తుతం కోటప్ప కొండ లో ఉంది. ఆమె విజయవాడ కనక దుర్గమ్మ గుడికి వెళ్తున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ కాకరేపుతున్నాయి. 

3 /6

తెలంగాణలో తాజాగా..శంషాబాద్ మండలంలోని జుక్కల్ ప్రాంతంలో పోచమ్మ అమ్మవారి విగ్రహాంను ధ్వంసం చేశారు. అంతే కాకుండా.. అమ్మవారి కళ్లను సైతం పీకేశారు. వస్త్రాలను పడేశారు. ఈ ఘటనపై లేడీ అఘోరీ ఫైర్ అయ్యింది. ఇటీవల శంషాబాద్ ఆలయంలో నవగ్రహాల విగ్రహాల ధ్వంసం కూడా జరిగిన విషయం తెలిసిందే. దసర నవరాత్రుల నుంచి ప్రతి రోజు ఎక్కడో ఒక చోట దేవాలయల విగ్రహాల ధ్వంసం మాత్రం ఆగడంలేదని లేడీ అఘోరీ మండిపడింది.   

4 /6

అంతే కాకుండా ముత్యాలమ్మ ఆలయం నుంచి పోచమ్మ ఆలయం వరకు ఇన్ని సంఘటనలు జరుగుతున్న రేవంత్ ఎందుకు స్పందించడంలేదని లేడీ అఘోరీ ఫైర్ అయ్యారు. అదే విధంగా.. తాను తెలంగాణకు వస్తున్నానని దమ్ముంటే తనను ఆపాలని కూడా రేవంత్ కు సవాల్ విసిరారు. నువ్వు వెనకుండి ఇవన్ని చేయిస్తున్నవా.. అంటూ ఫైర్ అయ్యారు.  

5 /6

రేవంత్ నిన్న సీఎం కూర్చి నుంచి ఎలా దించాలో తనకు బాగా తెలుసని లేడీ అఘోరీ అన్నారు. తనను ఆపే హక్కు ఎవరికి లేదని, తాను మోసాలు, అక్రమాలు చేయడంలేదని, కేవలం సనాతన ధర్మం కోసం మాత్రమే పోరాడుతున్నానని కూడా లేడీ అఘోరీ చెప్పుకొచ్చారు.

6 /6

ఈసారి నువ్వా నేనా.. తెలీపోవాలని కూడా లేడీ అఘోరీ సీఎం రేవంత్ సర్కారుపై మండిపడినట్లు తెలుస్తొంది. మరొవైపు లేడీ అఘోరీ పట్ల ఇప్పటికే ఒక లాయర్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన విషయంతెలిసిందే. దీనిపై ప్రస్తుతం ఏవిధమైన చర్యలు తీసుకుంటారో అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. మన గుళ్లను, మనఆడపిల్లలను, గోహత్యలను జరగకుండా మనమే కాపాడుకొవాలని అఘోరీ పిలుపునిచ్చినట్లు తెలుస్తొంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x