snake appears while chhath puja video: పాములను చూస్తేనే చాలా మంది భయంతో ఆమడ దూరం పారిపోతుంటారు. మరికొందరు పాములు అని చెప్తేనే అక్కడి నుంచి మాయమైపోతుంటారు. కానీ కొంత మంది పామలు కన్పిస్తే ... వాటిని పట్టే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. కానీ కొంత మంది పాముల్ని కొట్టి చంపేందుకు సైతం వెనుకాడరు. ఇదిలా ఉండగా.. పాములు ఎలుకల వేటలో మన ఇళ్లలోకి వస్తుంటాయి. పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటాయి.
छठ पूजा का यह अद्भुत वीडियो वायरल हो रहा है, जिसमें नदी में पूजा कर रही एक महिला एक सांप को आते हुए देखकर घबराई नहीं बल्कि उसने सांप को अपने पास से जाने का रास्ता दिया। pic.twitter.com/GjDpcWzLvI
— SUSHIL PANDEY (@sushilemedia) November 9, 2024
కొన్ని వీడియోలు చూస్తే విడ్డూరంగా అన్పిస్తుంటాయి. మరికొన్ని ఘటనలు మాత్రం బాబోయ్ పారిపోతాం.. అన్న విధంగాను కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో పాముల వీడియోలు చూసేందుకు నెటిజన్లుఎప్పుడు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఒక పాముకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.
పూర్తి వివరాలు..
ఉత్తరాదిన రాష్ట్రాలలో ఛత్ పూజల్ని ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా జార్ఖండ్, బీహార్ లలో ఛత్ పూజలు ఎక్కువగా చేస్తుంటారు. ఈ రోజున రాముడు, సీతమ్మ తల్లిని ఆరాధిస్తుంటారు. రామయ్య, సీతమ్మ అయోధ్యకు వచ్చి ఇదే రోజున.. సూర్యుడ్ని ఆరాధించారంట. అప్పటి నుంచి ఈ పూజను ఎంతో వేడుకగా చేస్తారు. ఈ పండగ ప్రతి ఏడాది.. కార్తీక శుక్ల చతుర్ది నాడు ప్రారంభమై కార్తీక శుక్ల సప్తమి రోజున ముగుస్తుంది.
ఆ సమయంలో మహిళలు ఉపవాసంతో ఉండి చివరి రోజున నదిలోకి వెళ్లి సూర్యుడికి అర్ఝ్యం ప్రదానం చేస్తారు. తాజాగా కొందరు మహిళలు అందుకోసం ఒక నదిలోకి గంగా స్నానం కోసం దిగారు. ఆ సమయంలో జరిగిన ఘటన చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్పుడు ఒక భారీ సర్పం మహిళ దగ్గరకు వచ్చింది. అది ఆమె పక్క నుంచి నీళ్లలోకి అటు ఇటు కాసేపు ఉండి... మరల దూరంగా వెళ్లిపోయింది.
Read more: Snakes: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. పాములకు రెడ్ కార్పేట్ వేసినట్లే.. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయ్..
కానీ మహిళకలు మాత్రం ఏ మాత్రం హనీ కల్గించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లుమాత్రం.. ఆ మహిళ మీద పాము కరుణ ఉందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. బోబోయ్ పాము నిజంగా ఇది అద్భుతమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.