Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త, రైతు భరోసా అమలకు నిర్ణయం, ఎప్పుడంటే

Rythu Bharosa Updates in Telugu: రైతులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నరైతు భరోసాపై క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది వేడుకల్లో భాగంగా ఈ భారీ హామీ నెరవేర్చేందుకు సిద్ధమౌతోంది. రైతుల ఖాతాల్లో ఆ తేదీనాటికి డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 10, 2024, 09:24 AM IST
Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త, రైతు భరోసా అమలకు నిర్ణయం, ఎప్పుడంటే

Rythu Bharosa Updates in Telugu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. సూపర్ సిక్స్‌తో అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఒక్కొక్క హామీ అమలు చేస్తోంది. అయితే అసలైన రైతు భరోసా కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడనుంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. 

తెలంగాణలో సూపర్ సిక్స్ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా హామీలు కూడా నెరవేర్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతు రుణమాఫీ కూడా అమలు చేసింది. దాదాపు 22 లక్షలమంది రైతులకు 18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు త్వరలో మరో 13 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది. గత ప్రభుత్వం హయాంలో 10 వేలు అందిస్తే తాము 15 వేలు ఇస్తామని చెప్పుకొచ్చింది. కానీ ఏడాది అవుతున్నా ఇప్పటి వరకూ ఈ హామీ అమలు కాలేదు. 

వాస్తవానికి రైతు భరోసా అనేది అన్నదాతలకు వివిధ రకాల ఖర్చులకు ఉపయోపడుతుంటుంది. అందుకే ఈ డబ్బుల కోసం రైతులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో ఈ హామీని కూడా నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఏడాది వేడుకలను ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తేదీ వరకూ 26 రోజులు ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమైంది. ఈ వేడుకల్లోనే రైతు భరోసా దశలవారీగా అమలు చేయాలని ఆలోచిస్తోంది.

రైతు భరోసా ఎవరికి, ఎప్పటికి పూర్తవుతుంది

 ఒక ఎకరా నుంచి ప్రారంభించి డిసెంబర్ ఆఖరుకు రైతు భరోసా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఏడెనిమిది ఎకరాలున్నా రైతు భరోసా వచ్చే అవకాశముంది. తెలంగాణలో ప్రస్తుతం 1.39 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. మొత్తం 7 వేల కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. దశలవారీగా అంటే ప్రతి 10 రోజులకు 1500 నుంచి 2 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయవచ్చు. మొత్తం 45 రోజుల్లో ఈ ప్రక్రియ ముగించేందుకు ప్రణాళిక రచిస్తోంది. రైతు భరోసాను పూర్తి చేయడం ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also read: Rain Alert: దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలెర్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News