Game Changer Teaser Talk Review: గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల.. రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా..

Game Changer Teaser Talk Review: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, రెండు పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను కాసేటి క్రితమే విడుదల చేసారు. మరి ఈ టీజర్ ఎలా ఉందంటే.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 9, 2024, 06:45 PM IST
Game Changer Teaser Talk Review: గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల.. రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా..

Game Changer Teaser Talk Review: రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంచర్’. దాదాపు నాలుగేళ్లుగా  ఈ సినిమా షూటింగ్ జరిగింది. రామ్ చరణ్ అభిమానులు మాత్రం  ఈ సినిమా టీజర్ ఎపుడెపుడా అని ఎదురు చూసారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమా టీజర్ లో రామ్ చరణ్ .. రామ్ పాత్రలో నటించాడు. ఈ టీజర్ లో రామ్ బేసిగ్గా మంచోడు. వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఉండడు అని హీరోగా క్యారెక్టర్ ను పరిచయం చేసాడు. మొత్తంగా మంచి వాళ్లకు మంచివాడని.. చెడ్డ వాళ్లకు చెడ్డవాడనే చెప్పాడు. మొత్తంగా హీరో పాత్ర ఔచిత్యాన్ని చెబుతూనే.. సినిమా టీజర్ కట్ చేసారు. మొత్తంగా శంకర్ మార్క్ గ్రాండియర్ కనిపించింది. మధ్యలో మధ్యలో హీరోయిన్ తో రొమాన్స్ వంటివి చూపించాడు. మరోవైపు మాస్ ఆడియన్స్ కోరుకునే యాక్షన్ సీన్స్ ను చూపించాడు. మొత్తంగా ‘గేమ్ ఛేంజర్’ విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.

శంకర్ గత చిత్రాల మాదిరి ఈ సినిమా కథ బాగుంటే.. ఈ సినిమాను ఆపడం ఎవరి తరం కాదు. ఐ, స్నేహితుడు సినిమాల నుంచి శంకర్ గాడి తప్పాడు. రీసెంట్ గా ‘భారతీయుడు 2’ రిజల్ట్ తో శంకర్ దర్శకత్వం పై అనుమానాలు కలిగాయి. మరి గేమ్ ఛేంజర్ తో శంకర్ మరోసారి దర్శకుడిగా తన మార్క్ చూపిస్తాడా అనేది వెయిట్ అండ్ సీ. తెలుగులో శంకర్ కు ఇదే తొలి స్ట్రెయిట్ చిత్రం.

ఇక రాజమౌళి, శంకర్ తో పనిచేసిన హీరోగా రామ్ చరణ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి. తాజాగా ఉత్తర ప్రదేశ్  రాజధాని లక్నో లో ఈ మూవీ టీజర్ ను విడుదల చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. తమిళంలో ఆదిత్య రామ్, హిందీ కరణ్ జోహార్ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు.  

 మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ , శాటిలైట్  బిజినెస్ కూడా ఓ రేంజ్ లో పూర్తైయింది.  శాటిలైట్ అన్ని భాషలకు కలిపి రూ. 70 కోట్లు.. ఓటీటీ హక్కులు కూడా దాదాపు రూ. 80 కోట్లు.. ఆడియో హక్కులు.. రూ. 30 కోట్లు.. వరకు అమ్ముడు పోయాట.  ఓ రకంగా నాన్ థియేట్రికల్ గా  ఈ సినిమా రూ. 180 కోట్ల లాభాలను నిర్మాత అందుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో ఇది 50వ చిత్రం. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగుతో పాటు తమిళం, హిందీలో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్.. నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. మరోవైపు అణగారిన వర్గాల తరుపున పోరాడే ప్రభుత్వాధినేతగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. మొత్తంగా ఈ చిత్రాన్ని ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఉండబోతున్నట్టు టాక్.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News