Sircilla Weaver: మార్పుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో చేనేత కళాకారులు సంక్షోభంలోకి పడ్డారని.. నిత్యం ఆత్మహత్యలు చోటుచేసుకుంటూ సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండడమే అడ్డు అయితే గంటలోపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Harish Rao: మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి అబద్ధాలు.. గాలి మోటార్లలో మంత్రుల చక్కర్లు
ఆర్థిక ఇబ్బందులు తాళలేక సిరిసిల్లలోని వెంకంపేటలో చేనేత కళాకారులైన భార్యాభర్తలు బైరి అమర్, స్రవంతి ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబాన్ని ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. ఆ కుటుంబం గాథ విని కేటీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అనాథలైన వారి ముగ్గురు పిల్లలకు ధైర్యం చెప్పి వారికి రూ.2 లక్షల చొప్పున ఒక్కొక్కరికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని చెప్పారు. వారి బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత జోళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడి బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు.
Also Read: Revanth Reddy: పాలమూరు బిడ్డగా ఆ పని చేయకుంటే నన్ను చరిత్ర క్షమించదు
అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'సిరిసిల్లలో ఇప్పటివరకు 20 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలను పొడిచిన వెన్నుపోటుతో ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలి' అని డిమాండ్ చేశారు. 'సిరిసిల్ల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉండడమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా' అని ప్రకటించారు.
సిరిసిల్లను.. వస్త్ర పరిశ్రమను సంక్షేభంలో నెట్టేలా రేవంత్ రెడ్డి కక్షకట్టడం మంచిది కాదని కేటీఆర్ హితవు పలికారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మానవత్వంతో స్పందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్లకు న్యాయం చేసేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా సిరిసిల్లలో ఒక కుటుంబాన్ని లేదా కొన్ని కుటుంబాలను మాత్రమే నేను ఆదుకోగలుగుతానని అన్ని కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి