Cracked Heels: తరచుగా పాదాల్లో ఈ సమస్యలు వస్తున్నాయా.. అయితే వీటి వల్లే జాగ్రత్త..!

Cracked Heels: చాలా మందిలో పాదాల పగుళ్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడమేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2022, 03:17 PM IST
  • శరీరంలో విటమిన్‌ లోపం ఉండడం కారణంగా..
  • పాదాల్లో మంటలు, పగుళ్లు ఏర్పడుతున్నాయి.
  • ఈ సమస్యలు రాకుండా పోషకాలున్న ఆహారాలు తీసుకోవాలి.
Cracked Heels: తరచుగా పాదాల్లో ఈ సమస్యలు వస్తున్నాయా.. అయితే వీటి  వల్లే జాగ్రత్త..!

Cracked Heels: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది పాదాల్లో విపరీతమైన మంటల సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇదే క్రమంలో మడమల పగుళ్లుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రెండు సమస్యలతో నడవలేకపోతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు తీసుకొని ఆహారంలో పోషకాలు లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు లేకపోవడం వల్ల చర్మం పొడి వారడం, అరికాళ్ళలో సమస్యలు, గోర్ల రంగు మారడం ఇటువంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పై సమస్యలకు ప్రధాన కారణాలు ఇవే:
శరీరంలో తగినన్ని పోషకాలు లేకపోవడం వల్ల పాదాలు తరచుగా పొడిబారుతాయి. అంతేకాకుండా వాటిల్లో తేమ తగ్గి మంటలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా పాదాలపై చర్మం గరుకుగా మారిపోయి లోతైన పగుళ్లు ఏర్పడతాయి. ఇలా పగుళ్లను నొప్పులు విపరీతంగా ఏర్పడి.. వివిధ రకాల సమస్యలు అవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారంలో విటమిన్ బిత3  విటమిన్ 3, విటమిన్ ఈ వంటి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

అగుళ్లను నివారించేందుకు జింకు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. జింక అధికంగా ఉండే పోషకాలను తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు దూరమవుతాయి.

హార్మోన్ల ప్రభావం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి:
శరీరంలో హార్మోన్ల ప్రక్రియ సరిగా జరగకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా అరికాళ్ళలో ఏర్పడ్డ పగుళ్లు నుంచి రక్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకుంటే శరీరానికి ప్రయోజనాలు లభించడమే కాకుండా ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు.

Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Also Read: Nagababu on Garikapati: చిరంజీవిని విసుక్కున్న గరికపాటి..నాగబాబు ఘాటు కౌంటర్.. అసూయ పుట్టాల్సిందే అంటూ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News