కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది: వెంకయ్య నాయుడు

ప్రపంచ వ్యాప్తంగా చైనా, కెనడా, అమెరికా దేశాల్లో ప్రమాదరక వైరస్‌లు విజృంభిస్తున్న నేపధ్యంలో దాని నియంత్రణపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రమాదకర వైరస్‌ ద్వారా తలెత్తుతున్న సమస్యలకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు

Last Updated : Jan 27, 2020, 08:01 PM IST
కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది: వెంకయ్య నాయుడు

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా చైనా, కెనడా, అమెరికా దేశాల్లో ప్రమాదరక వైరస్‌లు విజృంభిస్తున్న నేపధ్యంలో దాని నియంత్రణపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రమాదకర వైరస్‌ ద్వారా తలెత్తుతున్న సమస్యలకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు సంపూర్ణ సహకారంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. యాంటీ బయోటిక్స్‌ పనిచేయని పరిస్థితులు తలెత్తుతున్న ఈ పరిస్థితుల్లో మొండిగా మారిన వైరస్‌ల ప్రభావాన్ని రోగి తట్టుకునేలా పరిశోధనలపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలన్నారు.

చైనాతో పాటు కెనడా, అమెరికా దేశాల్లో కరోనా వైరస్‌ కారణంగా జరుగుతున్న ప్రమాదాన్ని గమనిస్తున్నాం. ఇక మిగిలిన దేశాలకు కూడా వ్యాప్తిచెందుతోందంటూ వార్తలొస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రమాదాన్ని ముందే గుర్తించి దానికి విరుగుడు కనుగొనడంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని సీసీఎంబిని సందర్శించిన ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులను ఉద్దేశించి మాట్లాడారు.

వైరస్‌ ప్రమాదం ఒక దేశానికో ఒక ప్రాంతానికో సంబంధించిన అంశం కాదని ప్రపంచ మానవాళిని కబళించి ప్రమాదంలోకి నెట్టివేసే అంశమని ఉపరాష్ట్రపతి అన్నారు. దీనిపై లోతుగా అధ్యనం చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ విషయంలో సీసీఎంబి కేంద్రంగా నూతన ఆవిష్కరణలతో పాటు మరింత విస్తృతమైన పరిశోధనలు జరగాలని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News