న్యూఢిల్లీ: సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)పై మరో ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో జరుగుతున్న పలు అసాంఘిక కార్యక్రమాల్లో సిమి హస్తం ఉందని పలుసార్లు రుజువు కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లోనూ సిమి పాత్ర ఉందని తేలిందని కేంద్ర హోంశాఖ ప్రకటన పేర్కొంది. సిమి అసాంఘిక చర్యలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర హోంశాఖ తమ ప్రకటనలో వెల్లడించింది.
మొత్తం 58 కేసుల్లో సిమి ప్రమేయం ఉందని కేంద్ర హోంశాఖ రూపొందించిన జాబితాలో వివరించినట్టు పీటీఐ తెలిపింది.