Vande Bharat Express Trains Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు కొనసాగుతుండగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఈ 9 రైళ్లతో కలిపి మొత్తం సంఖ్య 34 కి చేరనుంది. ఇప్పటివరకు లాంచ్ అయిన అన్ని వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరుపుకోగా.. తాజాగా రానున్న 9 రైళ్లను కూడా ఈ నెల 24న ప్రధాని మోదీనే వాటికి పచ్చ జండా ఊపి ప్రారంభించనున్నారు.
త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ ప్రకటనను నిజం చేస్తూ తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోచ్‌లను ఈ 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం వినియోగిస్తున్నట్టు రైల్వే శాఖ తమ ప్రకటనలో స్పష్టంచేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాల విషయానికొస్తే...
హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,
విజయవాడ - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,
కాసరగోడ్ - త్రివేండ్రం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,
పూరి - రూర్కెలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,
ఉదయపూర్ - జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,
రాంచీ - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,
తిరునెల్వేలి - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,
పాట్నా - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,
జామ్‌నగర్ - అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.
ఇది కూడా చదవండి : Women's Reservation Bill: లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు రెండూ కలిపి మొత్తం 50 మార్గాలను కవర్ చేస్తూ 25 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అయితే ఇప్పటికే కేరళ, ఒడిషా రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సేవలు అందిస్తుండగా కొత్తగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ రెండు రాష్ట్రాలకు ఒక్కో రైలు చొప్పున కేటాయించారు. అందులో ఒకటి కేరళలో కాసరగోడ్ - త్రివేండ్రం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా, మరొకటి ఒడిషాలో పూరి - రూర్కెలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాల్లో సేవలు అందించనున్నాయి.
ఇది కూడా చదవండి : 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి