వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కరోనా పై మరో చర్చకు దారి తీసింది. రెండు కరోనాల్లో, ఒకటి మీకు హ్యాంగోవర్ ఇవ్వవచ్చు, మరొకటి మిమ్మల్ని చంపేస్తుంది, అదెలాగంటారా? మున్ముందు మీకే తెలుస్తుంది అంటూ ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఈ వ్యత్యాసం అర్థం కాలేదు. అమెరికా మీడియా సంస్థ అయిన ఫాక్స్ న్యూస్ ప్రకారం, తాజా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో గణాంకాలు "కరోనా బీర్ వైరస్" కోసం చేసిన శోధనలే ఇటీవలి రోజుల్లో గణనీయంగా నమోదైనట్లు తెలిపాయి.
కరోనావైరస్, ప్రసిద్ధ బీర్ బ్రాండ్ కరోనా మధ్య ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని ఇది స్పష్టంగా తెలుస్తుంది. తూర్పు యూరోపియన్ దేశం ఎస్టోనియాలో ప్రస్తుతం "కరోనా బీర్ వైరస్" ఈ శోధనల్లో ఉర్రూతలూగిస్తుందని గూగుల్ సెర్చ్ ఇంజిన్ తెలియజేస్తోంది.
I hope our #PowerBreakfast family knows the difference.@mabena_bob @iamthabomdluli @tehillahniselow https://t.co/5uTlKp3cBe
— Realeboga Mashiane®🇿🇦 (@Toscallo) January 30, 2020
ట్విట్టర్ యూజర్ అయిన రిలేబోగా మాషియాన్ కరోన వైరస్ పై, దీని విజృంభనపై, రెండు కరోనాల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించే చిత్రాన్ని ట్వీట్ చేశాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..