Coronavirus XE Variant: భారత్‌లో కొత్త వేరియంట్‌ కలకలం.. ముంబైలో తొలి కేసు నమోదు!

New Coronavirus XE Variant. ఇటీవల బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ 'ఎక్స్‌ ఈ'.. భారత్‌లోనూ బయటపడింది. ఈ రోజు ఉదయం ముంబైలో 'ఎక్స్‌ ఈ' వేరియంట్‌ కేసు నమోదైంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 07:09 PM IST
  • భారత్‌లో కొత్త వేరియంట్‌ కలకలం
  • ముంబైలో తొలి కేసు నమోదు
  • 50 ఏళ్ల మహిళకు కొత్త వేరియంట్‌
Coronavirus XE Variant: భారత్‌లో కొత్త వేరియంట్‌ కలకలం.. ముంబైలో తొలి కేసు నమోదు!

New Coronavirus XE Variant Reported in Mumbai: కరోనా వైరస్ మహమ్మారి మూడో వేవ్ నుంచి ఉపశమనం పొందిన భారత దేశ ప్రజలకు బ్యాడ్ న్యూస్. కరోనా ఉద్ధృతి తగ్గుతోందని అనుకుంటున్న సమయంలో కొత్తరకం వేరియంట్‌ దేశంలో కలకలం రేపింది. ఇటీవల బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ 'ఎక్స్‌ ఈ'.. భారత్‌లోనూ బయటపడింది. ఈ రోజు ఉదయం ముంబైలో 'ఎక్స్‌ ఈ' వేరియంట్‌ కేసు నమోదైనట్లు బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. రెండు డోసులు వేసుకున్న 50 ఏళ్ల మహిళకు కొత్త వేరియంట్‌ సోకినట్టు అధికారులు తెలిపారు. 

కరోనా పరీక్షల్లో భాగంగా ముంబైకి చెందిన 230 మంది బాధితుల నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. వీటిలో 228 మందిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ కాగా.. ఒకరికి కప్పా వేరియంట్‌ సోకింది. మరొకరికి మాత్రం కొత్తరకం వేరియంట్‌ 'ఎక్స్‌ ఈ' సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని బీఎంసీ అధికారులు వెల్లడించారు. 230 మందిలో 21మంది బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో ఎవరికీ ఆక్సిజన్‌ అవసరం రాలేదని అధికారులు పేర్కొన్నారు. 

ఓ 50 ఏళ్ల మహిళకు కొత్త రకం వేరియంట్‌ సోకిందట. వృత్తిరీత్యా కాస్ట్యూమ్ డిజైనర్ అయిన ఆమె 2022 ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చారు. భారతదేశానికి వచ్చినప్పుడు ఆమెకు కోవిడ్-19 నెగిటివ్ అని తేలింది. అయితే మార్చి 2న చేసిన సాధారణ పరీక్షలో మాత్రం పాజిటివ్ అని తేలింది. ఈమె రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారట. 

యూకేలో జనవరి 19న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ ఈ కేసు నమోదైంది. ఒమిక్రాన్‌ BA.1,  BA 2 నుంచి రూపాంతరం చెందినదే ఈ కొత్త వేరియంట్ ఎక్స్‌ ఈ అట. ప్రస్తుతంలో ప్రపంచంలో ఎక్స్‌ ఈ కేసులు ఎక్కువ నమోదు కాకున్నా.. ఇతర వేరియంట్ల కంటే ఇది 10 శాతం ఎక్కువగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఇక దేశంలో కొత్త వేరియంట్‌ వెలుగు చూసిన నేపధ్యలో కేంద్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది.

Also Read: RRR Movie Total Collections: ఆర్ఆర్ఆర్ మూవీకి కాసుల వర్షం.. 12 రోజుల వసూళ్ల లెక్కలు

Also Read: Rohit Sharma: మరో 54 పరుగులే.. రోహిత్‌ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు! రెండో క్రికెటర్‌గా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News