MP ADG Purushottam relieved of his duties: భోపాల్: ఆయనొక ఉన్నతాధికారి.. అధికూడా ప్రజల రక్షణా బాధ్యతలను చూసుకునే పోలీసు రాష్ట్ర అధికారిగా ఉన్నత హోదాలో ఉన్నారు. కానీ ఆయన తన భార్యను కొట్టి పదవిని పొగొట్టుకున్నారు. భార్యను కొట్టిన వీడియో (Viral Video) చివరకు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్‌లో (MP) ఓ పోలీస్ ఉన్నతాధికారి విధుల నుంచి తొలగించారు. మధ్యప్రదేశ్‌లో పురుషోత్తం శర్మ (Purushottam sharma ) అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ADG) ఆఫ్ పోలీస్‌గా సేవలందిస్తున్నారు. అయితే ఆయన తన భార్యను కొడుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పురుషోత్తం శర్మ ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పురుషోత్తం శర్మ తన భార్యను కొడుతుండగా.. ఆయన తనయుడు ఈ వీడియోను తీసి హోంమంత్రి, ముఖ్య కార్యదర్శి, డిజిపికి పంపించి తండ్రిపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై చర్య తీసుకుంది ప్రభుత్వం. Also read: SP Balasubrahmanyam News: వదంతులు సృష్టించి బాధపెట్టొద్దు: ఎస్పీ చరణ్
అయితే ఈ ఘటనపై పురుషోత్తం శర్మ మాట్లాడుతూ.. తానేమీ నేరగాడిని కాదని, అది తమ కుటుంబ గొడవ అంటూ చెప్పారు. 32 ఏండ్ల క్రితం వివాహం జరగ్గా.. తన భార్య 2008లో ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. అప్పటినుంచి కూడా ఆమె తన ఇంట్లోనే అన్ని సౌకర్యాలతో ఉంటోందని.. తన ఖర్చుతోనే విదేశాలకు వెళుతోందని చెప్పుకొచ్చారు. తన భార్య కావాలనే ఇంట్లో కెమెరాలు పెట్టి ఇలా ఇరికించిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. పురుషోత్తం శర్మకు మరో మహిళతో సంబంధాలున్నాయని.. అందుకే హింసిస్తున్నాడంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. Also read: INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి