Gas Price Hike:సామాన్యుడి నెత్తిన మరోసారి భారం పడింది. ఎల్‌పీజీ వంటగ్యాస్ ధర మరోసారి పెరిగింది. అటు డొమెస్టిక్ గ్యాస్, ఇటు కమర్షియల్ గ్యాస్ రెండింటి ధరల్ని ఒక్కసారిగా పెరిగాయి. ఒక్కొక్క గ్యాస్ సిలెండర్ ధరకు ఎంత పెరిగిందంటే.
దేశంలో గ్యాస్ ధరలు(Gas Prices) మరోసారి పెరిగాయి. సామాన్యుడికి షాక్ ఇచ్చాయి. ఎల్‌పీజీ గ్యాస్(Lpg Gas)ధరల్ని చమురు కంపెనీలు పెంచడంతో 14.2 కిలోల సిలెండర్ ధర 884 రూపాయల 50 పైసలకు చేరుకుంది. అంటే సిలెండర్‌కు 25 రూపాయలు పెరిగింది. అటు కమర్షియల్ సిలెండర్‌పై 75 రూపాయలు పెరిగింది. ప్రతి 15 రోజులకోసారి గ్యాస్ ధరల్ని సమీక్షిస్తూ మార్కెట్ ధరల్ని బట్టి స్థిరీకరిస్తున్నాయి చమురు కంపెనీలు(Oil Companies). చివరిసారి ఆగస్టు 18న గ్యాస్ ధరను 25 రూపాయలు పెంచాయి. రెండు వారాలు తిరిగేసరికి మరోసారి సామాన్యుడి నెత్తిన గ్యాస్ పిడుగు పడింది. రెండు వారాల వ్యవధిలో వంటింటి గ్యాస్ ధర 50 రూపాయల వరకూ పెరిగింది. ఈ ఏడాది ఆరంభంలో గ్యాస్ సిలెండర్ ధర 694 రూపాయలుగా ఉంది. ఫిబ్రవరి, మార్చ్, జూన్ నెలల్లో కూడా చమురు కంపెనీలు ధరల్ని పెంచాయి. మొత్తం 5 సార్లు ధర పెరగగా..ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో కొద్దిగా తగ్గించినా..ఇప్పుడు మళ్లీ పెంచాయి. 2017 నుంచి పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని(Fuel Prices)పెట్రో ఉత్పత్తి కంపెనీలు పెంచుతున్నాయి. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు 29.11 కోట్లమందిపై భారం పడనుంది.
Also read: Mumbai Flash Floods: ముంబైలో మెరుపు వరదలు, భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook