కర్ణాటక ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు హంగ్ ఏర్పడే పరిస్థితిని సూచిస్తున్న నేపథ్యంలో జేడీఎస్ కీలకంగా మారనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు జెడిఎస్‌తో అప్పుడే మంతనాలు ప్రారంభించినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా, తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని బీజేపీ పేర్కొంటున్నది.
There is no question of alliance(with JDS) as we are already crossing 112 seats: Sadananda Gowda,BJP #KarnatakaElections2018 pic.twitter.com/Hi4ODkOaxo
— ANI (@ANI) May 15, 2018
ఇదిలా ఉండగా.. హంగ్ పరిస్థితి నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నేతలు 'కింగ్ మేకర్' జేడీఎస్‌తో మంతనాలు జరుపుతున్నారు. అధికారాన్ని చేపట్టేందుకు ఇరు పార్టీలు తగిన వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
సిద్దూకు ప్రజా వ్యతిరేకత
సిద్ధరామయ్యకు ప్రజా వ్యతిరేకత తగులుతోంది. ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చాముండేశ్వరిలో ప్రజలు ఓట్ల రూపంలో చూపిస్తున్నారు. ఇక్కడ సమీప ప్రత్యర్థి, జేడీఎస్‌కు చెందిన జీడీ దేవెగౌడపై సిద్ధరామయ్య వెనుకంజలో ఉన్నారు. సిద్ధరామయ్య పోటీపడిన మరో నియోజకవర్గం బాదామిలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు నుంచి ఆయనకు గట్టిపోటీ ఎదురవుతోంది. గుల్బర్గా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో, మధ్య కర్ణాటక, కోస్టల్ కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ హవా కొనసాగుతుండగా, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ గాలి వీస్తోంది.
CM Siddaramaiah is trailing from Chamundeshwari by over 12,000 votes, JD(S) GT Deve Gowda leading. Siddaramaiah leading in Badami by over 160 votes. (File Pic) #KarnatakaElectionResults2018 pic.twitter.com/FL0K3hrjXN
— ANI (@ANI) May 15, 2018
ఇదిలా ఉండగా, ఈసీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం తొమ్మిదిన్నర గంటల సమయానికి బీజేపీ 101 స్థానాల్లో, కాంగ్రెస్ 46 స్థానాల్లో, జేడీ(ఎస్) 38 స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
BJP takes lead on 101 seats, Congress 46, JD(S) 38, Others 03. #KarnatakaElectionResults2018 pic.twitter.com/SbThgigKvK
— ANI (@ANI) May 15, 2018