Babri Masjid Issue: డిసెంబర్ 6 అంటే బ్లాక్ ఫ్రైడే. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. ఈ సందర్భంగా బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నారిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజమ్ మరియు భారత రాజ్యాంగం అంశంపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2019లో బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఛీప్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ మందిరం నిర్మాణం కోసం అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. రామమందిరం నిర్మాణం పూర్తయి ప్రారంభం కూడా జరిగిపోయింది. అయితే సెక్యులరిజమ్ మరియు భారత రాజ్యాంగం అంశంపై నిర్వహించిన ఓ కారక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆయన తన అసమ్మతి వ్యక్తం చేశారు. సెక్యులరిజం సిద్ధాంతాల ప్రకారం న్యాయం లభించలేదని చెప్పారు. వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుమతివ్వడం న్యాయ ప్రక్రియలో అతిపెద్ద పరిహాసంగా ఆయన అభివర్ణించారు.
బాబ్రీ మసీదు కింద ఏ రామ మందిరం లేదు
వాస్తవానికి బాబ్రీ మసీదు అడుగున ఏ రామ మందిరం లేదని సుప్రీంకోర్టు కూడా అంగీకరించిందని, కానీ తీర్పు మాత్రం అందుకు విరుద్ధంగా ఇచ్చిందన్నారు. ముందు ప్రభుత్వం నియమించిన లిబ్రహాం కమిటీ 17 ఏళ్లు నిద్రావస్థలో ఉండి 2009లో ఓ నివేదిక ఇచ్చిందని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 1994లోని ఇస్మాయిల్ ఫారూఖీ వర్సెస్ భారత ప్రభుత్వం తీర్పును ఉదహరించారు. ఈ తీర్పు ప్రకారం 67 ఎకరాల భూమి ఆక్రమణను సక్రమంగా తేల్చగా జస్టిస్ అహ్మది మాత్రం ఇది చట్టానికి, సెక్యులరిజానికి వ్యతిరేకమని చెప్పారని గుర్తు చేశారు.
2019 రామ జన్మభూమి తీర్పు
రామ జన్మభూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును ప్రస్తావించారు. ఇందులో అప్పటి ఛీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు 5 మంది న్యాయమూర్తులు ఏకగ్రీవంగా వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ జన్మభూమికి అప్పగిస్తూ తీర్పు ఇచ్చారు. సున్నీ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ప్రత్యామ్నాయ భూమిని అప్పగించారు. 1992లో మసీదు విధ్వంసంతో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని కూడా కోర్టు విశ్వసించింది. 1857 నుంచి 1949 వరకూ ముస్లింలు ఆ స్థలంలో నమాజు చేసేవారని కోర్టు నమ్మినట్టుగా ఆ తీర్పులో ఉందని జస్టిస్ నారిమన్ చెప్పారు. అయినా సరే మొత్తం స్థలాన్ని హిందూవులకు అప్పగిస్తూ తీర్పు ఇవ్వడం అంటే న్యాయ ప్రక్రియలో పెద్ద పరిహాసమన్నారు.
బాబ్రీ మసీదు నిర్మాణం 1528లో జరిగిందని అప్పట్నించి ఇది మసీదుగా ఉనికిలో ఉందని జస్టిస్ నారిమన్ చెప్పారు. కానీ 1853లో తొలిసారి వివాదం చోటుచేసుకుందని గుర్తు చేశారు. 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీషు ప్రభుత్వం అధికార బదిలీ జరగగానే మసీదు లోపల బయట ఓ గోడ నిర్మించారన్నారు. అప్పట్నించి గోడకు లోపలి భాఘంలో ముస్లింలు నమాజు చేసుకుంటుంటే, బయటి భాగంలో హిందూవులు పూరజలుచేసుకునేవారన్నారు. 1949 వరకూ ఇదే కొనసాగింది. కానీ 1949లో కొంతమంది మసీదులో చొరబడి విగ్రహాలు అమర్చారని ఆ తరువాత ముస్లింల నమాజులు ఆగిపోయాయని జస్టిస్ నారిమన్ వివరించారు.
2003లో భారత పురావస్తు శాఖ సమర్పించిన నివేదికను కూడా జస్టిస్ నారిమన్ ప్రస్తావించారు. వివిధ మతాలకు సంబంధించిన పురావస్తు అవశేషాలు లభ్యమైనట్టుగా నివేదికలో ఉందన్నారు. ఇందులో శైవం, బౌద్ధం, జైన మతాల సంస్కృతి అనవాళ్లున్నాయి. బాబ్రీ మసీదు అడుగున ఏ రామమందిరం లేదని సుప్రీంకోర్టు నమ్మిందని ఆయన చెప్పారు. అయినా సరే 1857 నుంచి 1949 వరకూ వివాదాస్పద స్థలంపై ముస్లింలకు ప్రత్యేక అధికారం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందన్నారు. ఈ స్థలంలో హిందూ వర్గం చట్టాన్ని ఉల్లంఘించినందున ఎలాంటి ఏకపక్ష వాదన మంచిది కాదని కూడా కోర్టు తెలిపిందన్నారు.
ప్రతిసారీ హిందూవర్గాలు చట్టాన్ని ఉల్లంఘించాయని అయినా సరే మసీదు పునర్మిర్మాణం చేయకుండా ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చారని జస్టిస్ నారిమన్ చెప్పారు. లౌకికవాదంతో న్యాయం అందించడంలో వైఫల్యం చెందినట్టేనన్నారు. సుప్రీంకోర్టు తీర్పులో లౌకికత్వాన్ని పట్టించుకోలేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది న్యాయ ప్రక్రియకే పరిహాసమన్నారు. ఆఖరికి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులందర్నీ విడిచిపెట్టేశారన్నారు.
Also read: Holidays 2025: ఏపీలో వచ్చే ఏడాది 44 సెలవులు, జాబితా విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.