International flights ban extended | న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించినట్టు కేంద్రం ప్రకటించింది. కార్గో విమానాలు, చార్టర్ ఫ్లైట్స్, వందేభారత్ మిషన్ కింద రాకపోకలు సాగిస్తున్న విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం నడుస్తున్న విమానాల రాకపోకలకు అనుమతించనున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) స్పష్టంచేసింది. అవసరాన్నిబట్టి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను అనుమతించే అవకాశం లేకపోలేదని డీజీసీఏ తమ ప్రకటనలో పేర్కొంది.
అంతర్జాతీయ విమానాలపై ఇదివరకు విధించిన నిషేధం డిసెంబర్ 31తో ముగియనున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ ప్రకటన చేసింది. ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ ( Bilateral air bubble ) ప్రకారం ముందే ఒప్పందం చేసుకున్న పలు దేశాల నుంచి విమానాల రాకపోకలకు భారత్ సహకరిస్తున్న సంగతి తెలిసిందే.
Also read : New CoronaVirus Strain: కొత్త వైరస్ భయంకరమైనది కాదు: మంత్రి ఈటల
అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మాల్దీవులు, నేపాల్, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఖతార్, రువాండా, టాంజానియా, ఉక్రెయిన్, యుఏఇ లాంటి మొత్తం 23 దేశాలతో ప్రస్తుతం భారత్ ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల ప్రకారమే ఆయా దేశాల నుంచి డీజీసీఏ అనుమతించిన అంతర్జాతీయ విమానాలు ( International flights ) రాకపోకలు సాగిస్తున్నాయి.
Also read : Telangana ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు.. వేతనాల పెంపు, మరెన్నో నిర్ణయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook