మొబైల్ డేటా వినియోగంలో భారత్ నంబర్ వన్ స్థానాన్ని సంపాదించిందని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అమెరికా, చైనాలను అధిగమించి భారత్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా జీయో లాంటి టెలికాం సంస్థలు వివిధ ఆఫర్లు ప్రకటించిన తర్వాత.. భారతదేశంలో మొబైల్ డేటాను వాడే వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరిగింది.
పబ్లిక్ వైఫై వ్యవస్థను కూడా కొన్నిచోట్ల వినియోగదారులు పొందుతున్న సందర్భంలో నేడు మనదేశంలో అత్యధిక శాతం మంది మొబైల్ డేటా వినియోగదారులుగా అప్రయత్నంగానే మారిపోతున్నారు. అయితే అధిక మొబైల్ డేటా స్పీడ్‌ను అందుకుంటున్న దేశాలతో పోల్చుకుంటే.. భారత్ వెనుకబడే ఉందని చెప్పవచ్చని పలువురు టెలికాం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 150 కోట్ల గిగా బైట్స్‌ను భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయెగించడం వల్ల నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
Today, @BSEIndia m-cap hits 1.5 crore crore for the first time. And data consumption crosses 150 crore GB/month. Something for the world to notice about #YeMeraIndia 🇮🇳👍 pic.twitter.com/PmiJbC0XPx
— Rohit Bansal 🇮🇳 (@theRohitBansal) December 22, 2017