Corona cases in India: దేశంలో కొవిడ్ కల్లోలం- కొత్తగా 1,41,986 కేసులు నమోదు!

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. తాజాగా 1,41,986 కరోనా కేసులు (Corona new cases in India) బయటపడ్డట్లు తెలిసింది. గడిచిన 24 గంటల్లో 15,29,948 టెస్టులకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 09:56 AM IST
  • దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కొవిడ్ తీవ్రత
  • దేశంలో కొత్తగా 1.4 లక్షల కేసులు నమోదు
  • వివిధ రాష్ట్రాల్లో కఠినంగా కొవిడ్ ఆంక్షలు
Corona cases in India: దేశంలో కొవిడ్ కల్లోలం- కొత్తగా 1,41,986 కేసులు నమోదు!

India corona Update: దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. తాజాగా 1,41,986 కరోనా కేసులు (Corona new cases in India) బయటపడ్డట్లు తెలిసింది. గడిచిన 24 గంటల్లో 15,29,948 టెస్టులకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతంగా నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.

మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్​ వంటి రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. కరోనా తోపాటు.. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు వెంటాడుతున్నాయి.

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Omicron cases in India) 3,071 ఒమిక్రాన్ నమోదయ్యాయి. అందులో ఇప్పటికే 1,203 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్​ వేరియంట్ వ్యాపించింది.

యాక్టివ్​  కేసులు ఇలా..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4,72,169 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.42 శాతానికి పెరిగింది.

మరణాలు ఇలా..

కరోనా కారణంగా తాజాగా 285 మంది మృతి చెందారు. దీనితో దేశంలో కరోనా మృతుల సంఖ్య (Corona deaths in India) 4,83,463 వద్దకు చేరింది. కొవిడ్​ మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.

తగ్గిన రికవరీ రేటు..

ఇప్పటి వరకు దేశంలో 35,368,372 మందికి కరోనా సోకగా.. అందులో  3,44,12,740 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 97.30 శాతానికి దిగొచ్చింది.

వ్యాక్సినేషన్ ఇలా..

శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 90,59,360 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,50,61,92,903 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 303,837,335 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,497,396 మంది మహమ్మారికి బలయ్యారు. 258,264,797 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 40,075,142 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Night curfew in Gujarat: గుజరాత్​లో రాత్రి పూట కర్ఫ్యూ- విద్యా సంస్థలకు సెలవులు

Also read: Weekend Curfew: ఢిల్లీ, కర్ణాటకల్లో నేటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ.. అమలులోకి ఈ నిబంధనలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News