Saif ali khan stabbing case: సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఘటనలో దీనిలో కరీన కపూర్ హస్తముందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై జన్వరి 16న బాంద్రాలోని ఆయన నివాసంలో ఆగంతకుడు తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో ప్రవేశించాడు. ఈక్రమంలో సైఫ్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్‌తో కలిసి 12వ అంతస్తులోని వారి బెడ్రూమ్లో ఉన్నారు.
జనవరి 16న తెల్లవారుజామున 2.30 నుండి 2.40 గంటల మధ్య తన ఇంట్లో అలికిడి విన్పించింది. వెంటనే.. సూఫ్.. 11 వ అంతస్తుకు వచ్చాడు. పిల్లలు.. తైమూర్, జెహ్ లను సంరక్షకులుగా ఉన్న వారిపై అక్కడికి చేరుకున్న ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు.
అక్కడికి సైఫ్ రాగానే అతనిపై కత్తితొ ఇష్టమున్నట్లు పొడిచాడు. ఆ తర్వాత తోపులాట జరిగిన తర్వాత ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. సైఫ్ ఏడేళ్ల కుమారుడు అతడ్ని లీలావతి ఆస్పత్రి తరలించాడు. వైద్యులు రెండు సర్జరీలు చేశారు. వెన్నుపాములో ఉన్న కత్తిముక్కను తొలగించారు.
ఈ క్రమంలో పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడపట్టి సీసీఫుటేజీ ఆధారంగా.. షరీఫుల్ ఇస్లాం షెహబాజ్ ను ముంబైలో అరెస్ట్ చేశారు. అతను చేసిన ఫోన్ పేతొ కొనుగోలు చేసిన పరాటా, వాటర్ బాటిల్ ఆధారంగా అతడ్ని గుర్తించారు. ముంబైలో కోర్టులో హజరుపర్చారు.
ఇటీవల కోర్టు షరీఫుల్ ఇస్లాం షెహబాజ్ కు ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఆదేశించింది. ప్రస్తుతం బాంద్రా పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే.. నిందితుడు చెప్పిన విషయాలకు..ఇంట్లో పనిమనిషి, కరీన కపూర్ చెప్పిన విషయాలకు పొంతనలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి పూట ఆగంతకుడ్ని రూమ్ లో బంధించినట్లు పనిమనుషులుచెప్పారు. మళ్లీ అతను డోర్ తీసుకుని ఎలాపారిపోయాడు. అంతే కాకుండా.. కరీనా ఘటన రోజు రాత్రి పూట తన సోదరితో కలిసి పార్టీచేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికొచ్చారు. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నారు.
అయిన కూడా.. ఏడేళ్ల కొడుకునిచ్చి ఆస్పత్రికి ఎలా పంపిస్తారని కూడా పోలీసులు డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారంట. అంతే కాకుండా.. కరీనా ఘటన జరిగాక.. మధ్యాహ్నాం వెళ్లడం.. రాత్రి పూట పనిమనిషీతో మాట్లాడుతూ టైమ్ పాస్ చేయడం అనుమానస్పదంగా మారిందంట. మరోవైపు ఒక వేళ ఆగంతకుడు పలు మార్లు కత్తిపోట్లు పొడిస్తే.. అతని శరీరంపై కూడా రక్తపు మరకలు ఉండాలి. కానీ అక్కడ కన్పించలేదు.
మరోవైపు ఇది ఒకరు చేశారా.. లేదా ఇంకా ఉన్నారా.. అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. బాంద్రా పోలీసులు పనిమనిషి చెప్పినదానికి, కరీనా చెప్పినదానికి వ్యత్యాసం ఉందని అన్నట్లు తెలుస్తొంది. దీంతో ఈ కేసులో కరీనా పాత్ర మెయిన్ గా ఉన్నదా.. అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. సైఫ్.. తొలుత.. హీరొయిన్ అమృతా సింగ్ ను..1991 లో పెళ్లి.. సైఫ్ , అమృతాలకు... సారా, ఇబ్రహీం సంతానం. 2004 లో వీరికి డైవర్స్ అయ్యారు. ఆతర్వాత కరీనాతో రిలేషన్ల లో ఉన్న సైఫ్.. 2012 లో కరీనాను పెళ్లి చేసుకున్నాడు.