Note Printing Cost: కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా..!

Currency Printing Cost All Currencies: ప్రస్తుతం మన దేశంలో రూ.10 నుంచి 2 వేల రూపాయల నోటు వరకు చలామణిలో ఉన్నాయి. అయితే ఏ నోటుకు ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా..? ఇవిగో పూర్తి వివరాలు..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2022, 02:58 PM IST
Note Printing Cost: కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా..!

Currency Printing Cost All Currencies: డీమోనిటైజేషన్ సమయంలో పాత రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న అతి చిన్న నోటు 10 రూపాయలు కాగా.. అతిపెద్ద నోటు 2 వేల రూపాయలు. 10 రూపాయల నోటు నుంచి రెండు రూపాయల నోటు వరకు ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఏయే నోటుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుకోండి.

2021-22 ఆర్థిక సంవత్సరంలో (FY22), ఆర్బీఐ 10 రూపాయల నోట్లను వెయ్యి ముద్రించడానికి  960 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  అదేవిధంగా 20 రూపాయల నోట్లు 1000 ముద్రించడానికి 950 రూపాయలు చెల్లిస్తోంది. రూ.50 నోట్లు వెయ్యి ప్రింట్ చేయడానికి రూ.1,130 ఖర్చు చేసింది.
అదేవిధంగా రూ.100 వెయ్యి నోట్ల ముద్రణ ఖర్చు రూ.1,770, 200 రూపాయల వెయ్యి నోట్ల ముద్రణకు 2,370 రూపాయలు చెల్లించింది.

రూ.500 వెయ్యి నోట్లను ముద్రించేందుకు రూ.2,290 ఖర్చయింది. 2018-19 తర్వాత 2000 రూపాయల నోట్ల ముద్రణ గణాంకాలు అందుబాటులో లేవు. రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆర్బీఐ నిలిపి వేసింది. బ్యాంక్‌లకు చేరిన రూ.2 వేల నోట్లు ఆర్భీఐ వద్దకు చేరుతున్నాయి. అవి మళ్లీ వినియోగంలోకి రావడం లేదు. క్రమంలో రూ.2 వేల నోటు కనుమరుగు కానుంది.

నోట్ల ముద్రణ ఇక్కడ జరుగుతుంది

దేశంలో నోట్ల ముద్రణ నాలుగు ప్రెస్‌లలో జరుగుతోంది. వీటిలో రెండు ప్రెస్‌లు మైసూరు, సల్బోనిలో ఉన్న ఆర్భీఐ అనుబంధ సంస్థ బీఆర్ఎన్ఎమ్ఎల్‌కుచెందినవి. నాసిక్, దేవాస్‌లో ఉన్న మరో రెండు ప్రెస్‌లు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి. ఈ రెండు ప్రెస్‌లను సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) పర్యవేక్షణలో ఉన్నాయి. 

Also Read: Ind vs Nz Squad: టీమిండియాతో సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్  

Also Read: Guru Margi 2022: ఈ రాశిలో బృహస్పతి సంచారం.. ఆ రాశువారికి ఆర్థిక సమస్యలు చెక్‌.. డబ్బే..డబ్బు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News