Gujarat: మాస్క్ ధరించకపోతే రూ.1000 ఫైన్

దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ -19 నివారణలో భాగంగా.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Last Updated : Aug 10, 2020, 05:15 PM IST
Gujarat: మాస్క్ ధరించకపోతే రూ.1000 ఫైన్

covid-19 face masks fine: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ -19 నివారణలో భాగంగా.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల నేపథ్యంలో.. గుజరాత్ ప్రభుత్వం ( Gujarat Govt ) బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వ్యక్తులకు గుణపాఠం చెప్పేవిధంగా.. ప్రస్తుత రూ .500 జరిమానాను వేయి రూపాయలకు పెంచింది. Also read: Rave Party: డిల్లీ లో రేవ్ పార్టీ.. పోలీసుల రైడ్..

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి దగ్గర నుంచి కనీసం వేయి రూపాయల జరిమానా వసూలు చేయాలని గుజరాత్ హైకోర్టు గత నెలలో ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో కరోనా నుంచి రక్షణకు మాస్కులు కీలకమైనవని.. కావున చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ.. బహిరంగంగా మాస్క్ ధరించనందుకు దీని జరిమానాను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ( Vijay Rupani ) పేర్కొన్నారు. ఈ జరిమానా ఆగస్టు 11 నుంచి రాష్ట్రంలో అమలవుతుందని పేర్కొన్నారు. Also read: Covid-19: ఒక్కరోజే వేయికి పైగా కరోనా మరణాలు

అంతకుముందు గుజరాత్‌లో మాస్క్ ధరించనందుకు జరిమానా 200లు ఉండగా.. ఇటీవల దానిని ప్రభుత్వం 500లకు పెంచింది. మరలా దానిని వేయి రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. Also read: Donkey Milk: త్వరలో గాడిద పాల డెయిరీ ప్రారంభం

Trending News