Google CEO Sundar Pichai: ప్రధాని నరేంద్ర మోదీ గురించి సుందర్ పిచ్చయ్ ఏమన్నారో తెలుసా ?

Google CEO Sundar Pichai: ఇప్పటికీ దేశంలో టన్నుల కొద్ది అవకాశాలు ఉన్నాయని.. సాంకేతిక మార్పులో దేశం అద్భుతమైన పురోగామివృద్ధి సాధించింది అని సుందర్ పిచ్చయ్ గుర్తుచేశారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని దగ్గరిగా చూసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది.

Written by - Pavan | Last Updated : Dec 19, 2022, 09:42 PM IST
  • ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా ఎజెండాపై సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు
  • ప్రధాని నరేంద్ర మోదీతో భేటీపై ట్విటర్ ద్వారా స్పందించిన సుందర్ పిచాయ్
  • ఇండియాలో అభివృద్ధిపై తన అభిప్రాయాన్ని పంచుకున్న సుందర్ పిచాయ్
Google CEO Sundar Pichai: ప్రధాని  నరేంద్ర మోదీ గురించి సుందర్ పిచ్చయ్ ఏమన్నారో తెలుసా ?

Google CEO Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ప్రధాని మోదీతో భేటీ గురించి ట్విటర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. మీ నాయకత్వంలో సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందింది అని కొనియాడారు. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా ఎజెండా దేశాభివృద్ధికి ఎంతో దోహదపడిందని సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. జి20 సదస్సుకు భారత్ కు అధ్యక్షత వహించే అవకాశం రావడంతో పాటు భారత్ సాధించిన విజయాలను జి20 వేదికగా ప్రపంచంతో పంచుకునే అవకాశం రావడంపై సుందర్ పిచ్చాయ్ హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీతో సమావేశాన్ని అద్భుతమైన అవకాశంగా పేర్కొన్న సుందర్ పిచాయ్.. ఈ సందర్భంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికీ దేశంలో టన్నుల కొద్ది అవకాశాలు ఉన్నాయని.. సాంకేతిక మార్పులో దేశం అద్భుతమైన పురోగామివృద్ధి సాధించింది అని సుందర్ పిచాయ్ గుర్తుచేశారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని దగ్గరిగా చూసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది. భారత్‌లో మరోసారి ఎప్పుడు పర్యటిస్తానా అనే ఉత్కంఠతో ఉన్నాను అని సుందర్ పిచాయ్ తెలిపారు. 

ఇండియాలో స్టార్టప్స్‌కి, చిన్న చిన్న వ్యాపారాలకు, సైబర్ సెక్యురిటీ రంగంలో పెట్టుబడులకు, సాంకేతిక విద్యలో నైపుణ్యం పెంచడం, శిక్షణ అందించడం, వ్యవసాయం, వైద్య, ఆరోగ్య రంగాల్లో కృత్రిమ మేథస్సు వంటి అంశాలను గూగుల్ ప్రోత్సహిస్తున్న విషయాన్ని సుందర్ పిచాయ్ గుర్తుచేసుకున్నారు. భారత్‌లో సాంకేతిక రంగంలో యువత అవకాశాలను అందిపుచ్చుకుంటున్న తీరును సుందర్ పిచాయ్ ప్రశంసించారు.

ఇది కూడా చదవండి : 1000 Notes Coming Back: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా ? 2 వేల నోట్లు బ్యాన్ ? ఏది నిజం ?

ఇది కూడా చదవండి : Cockroach Found in Omelette: రైల్లో ఆహారం తింటున్నారా ? ఆమ్లెట్‌లో బొద్దింకపై ప్రధానికి ఫిర్యాదు

ఇది కూడా చదవండి : Train Ticket Charges: రైలు టికెట్లపై రాయితీలు నిజమేనా ? లేక ఊహాగానాలా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News