Election Commission Of India: ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన భారత ఎన్నికలు.. ఈసీ ప్రకటన..

Election Commission Of India: దేశ వ్యాప్తంగా 18వ లోక్  సభకు 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి.  దేశ భావి భారత ప్రధాన మంత్రిని ఎన్నుకునే ఈ ఎలక్షన్ పై దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో వరల్డ్ వైడ్ గా ఎక్కువ మంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొని సరికొత్త ప్రపంచ రికార్డును క్రియేట్  చేసినట్టు ఈసీ ప్రకటించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 3, 2024, 02:03 PM IST
Election Commission Of India:  ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన భారత ఎన్నికలు.. ఈసీ ప్రకటన..

Election Commission Of India: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 7 విడతల్లో జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి దాదాపు రెండు నెలలు పైగా సమయం పట్టింది.  ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికలతో ప్రారంభమై.. జూన్ 1 జరిగిన చివరి విడత ఎన్నికలతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ ఎలక్షన్స్ లో మన దేశంలో 64.2 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్  మీడియాకు  వెల్లడించింది. అంతేకాదు.. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఓటర్లు పాల్గొన్న ఈ ఎలక్షన్స్ ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిందని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈయన
తన తోటి ఎన్నికల కమిషనర్స్ అయినా.. జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ లతో కలసి ఎన్నికలు జరిగిన తీరుపై మాట్లాడారు. ఇక ఎన్నికల కౌంటింగ్ ముందు ఈసీ ఇలా ఓ ప్రెస్ మీట్ నిర్వహించడం  ఇదే తొలిసారి.  

తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది తమ ఓటుతో భావి భారత ప్రధానిగా ఎవరు ఉండాలనేది నిర్ణయించారు. అంతేకాదు జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఇది ఎక్కువ అన్నారు. యూరోప్ కంట్రీస్ లోని 27 దేశాల ఓటర్ల కంటే మనదేశంలో ఓటింగ్ పాల్గొన్నవారు 2.5 రెట్లు ఎక్కువ అని తెలిపారు. ఈ ఎన్నికల్లో సీ విజిల్ యాప్ ద్వారా నాలుగు లక్షల 56 వేల కంప్లైంట్స్ వచ్చాయి. అందులో 87.5 శాతం వంద నిమిషాల్లో సాల్వ్ చేసినట్టు చెప్పారు. ఎన్నికల్లో డీప్ ఫేక్ వీడియోల ఆగడాలను అరికట్టామన్నారు.

మొత్తంగా 64.2 ఓటర్లలో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు ఈ సారి  ఓటు వేయడం విశేషమన్నారు. అంతేకాదు ప్రజాస్వామ్య విజయమన్నారు.
దాదాపు ఒక కోటి 50 లక్షల పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించారు. దాదాపు 68,763 మంది ఈ ఎలక్షన్స్ ను  డేగ కళ్లతో వాచ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.

 దేశంలోని 27 స్టేట్స్, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీ పోలింగ్ అవసరం పడలేదన్నారు. ప్రజలందరు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.  లాస్ట్ ఎలక్షన్స్ లో 540 చోట్ల రీ పోలింగ్ జరిగ్గా.. ఈ సారి అది 39 ప్రాంతాలకే పరిమితమైందన్నారు.   

దేశ వ్యాప్తంగా కేవలం రెండు రాష్ట్రాల్లో కేవలం 25 ప్లేస్ లలో మాత్రమే రీ పోలింగ్ నిర్వహించిన విషయాన్నిప్రస్తావించారు. గతంతో పోలిస్తే జమ్మూ కశ్మీర్ లో పోలింగ్ శాతం పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడ మొత్తంగా 58.58 పోలింగ్ పర్సంటేజీ నమోదు అయినట్టు  చెప్పారు. అటు కశ్మీర్ లోయలో కూడా 51.05 శాతం పోలింగ్ జరగడం ప్రజాస్వామ్యా విజయానికి పెద్ద నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 10 వేల కోట్లకు పైగా నగదు, కానుకలు, మద్యం వంటివి  సీజ్ చేసినట్టు వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా జూన్ 4న తేదిన ఉదయం 8 గంటలకు 542 లోక్ సభ ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. లోక్ సభతో పాటు ఆంధ్ర ప్రదేశ, ఒడిషా రాష్ట్రాల్లోని శాసన సభ ఫలితాలు కూడా అపుడే వెల్లడించనున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం .. సిక్కిం, అరుణాల ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే కదా.

Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..

Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News