/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Delhi Chalo farmer's protest: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ బిల్లులకు సంబంధించి మంగళవారం పలు రైతు సంఘాల ప్రతినిధులతో (Farmers Organizations).. కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ చట్టాలు సహా రైతులు లేవనెత్తిన అన్ని విషయాల అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ( Central Government ) సూచనను రైతు సంఘాల ప్రతినిధులు వ్యతిరేకించారు. వివాదాస్పద వ్యవసాయ బిల్లులన్నింటినీ రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలన్ని డిమాండ్ చేశాయి. దీంతో చర్చలు కొలిక్కిరాకుండానే ముగిశాయి. అయితే కేంద్రం గురువారం మరోసారి రైతు సంఘాల ప్రతినిధులతో భేటికానుంది. 

ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ముగ్గురు కేంద్ర మంత్రులతో 35 రైతు సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ (Narendra Singh Tomar), రైల్వే, కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మంత్రి పీయూష్‌ గోయల్ (Piyush Goyal), వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్‌ ప్రకాశ్‌  (Som Prakash) పాల్గొన్నారు. కొత్త సాగు చట్టాల వల్ల కనీస మద్దతు ధర వ్యవస్థ రద్దయిపోతుందని, కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడే పరిస్థితి వస్తుందని రైతు సంఘాల ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర మంత్రుల ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. దీనికోసం ఆరుగురి పేర్లు ఇవ్వాలని సూచించగా.. 35 రైతు సంఘాల ఐక్యతను విచ్ఛిన్నం చేసే ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తున్నామని ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం నాటి చర్చలకు చట్టాల్లోని అభ్యంతర విషయాలతో రావాలని కేంద్ర రైతులకు సూచించింది. Also read: Kamal Haasan: రైతుల డిమాండ్లను ప్రభుత్వం వినాలి

దేశంలోని పలు రైతు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్‌ (Delhi Chalo protest) నిరసన బుధవారంతో ఏడోరోజుకు చేరుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ.. చలి తీవ్రత పెరిగినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ నిరసన తెలుపుతున్నారు.  Also read: Delhi Chalo: కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు కేంద్రంతో సమావేశం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Delhi Chalo protest Live: Farmer union leaders reject Centre's offer to set up committee; talks remain inconclusive over new agriculture laws
News Source: 
Home Title: 

Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ

Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ
Publish Later: 
No
Publish At: 
Wednesday, December 2, 2020 - 06:20
Request Count: 
103